Aided Schools : ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Aided Schools : ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనం.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో

Aided Schools

Aided Schools : ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు విద్యాసంస్థల విలీనానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల విలీనానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 2వేల 249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది.

702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించ లేదని తెలిపింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. విలీనానికి నాలుగు ఆప్షన్లను ఎయిడెడ్ విద్యా సంస్థలు ముందున్నాయన్న ఉన్నత విద్యాశాఖ.. విలీనానికి ఒప్పుకోని సంస్థలు 4వ ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపింది.

YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

ఆప్షన్‌-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా విలీనానికి సుముఖత.

ఆప్షన్‌-2: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ స్కూళ్లుగా కొనసాగే అవకాశం.

ఆప్షన్‌-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగడం.

ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

Samsung Cleaning Cloth : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ ఫన్ ప్రమోషన్ ఆఫర్..!

ఈ ఆప్షన్లను కచ్చితంగా పాటించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థల్ని బలవంతంగా విలీనం చేసుకుంటోందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.