Akasa Air: వచ్చే నెల నుంచి విశాఖ-బెంగళూరు మధ్య ఆకాశ ఎయిర్ విమాన సేవలు.. రోజుకు రెండు సర్వీసులు

దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ ఏపీలోని విశాఖపట్నంలో తన సేవలు ప్రారంభించనుంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య వచ్చే నెల 10 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

Akasa Air: వచ్చే నెల నుంచి విశాఖ-బెంగళూరు మధ్య ఆకాశ ఎయిర్ విమాన సేవలు.. రోజుకు రెండు సర్వీసులు

Akasa Air: ఏపీ, విశాఖపట్నం ప్రజలకు గుడ్ న్యూస్. ఇటీవలే విమానయాన సేవలు ప్రారంభించిన దేశీయ సంస్థ ‘ఆకాశ ఎయిర్’ త్వరలో విశాఖ పట్నం నుంచి విమాన సర్వీసులు నడపనుంది. డిసెంబర్ 10 నుంచి విశాఖ పట్నం-బెంగళూరు మధ్య విమానయాన సేవలు మొదలవుతాయని ఆ కంపెనీ ప్రకటించింది.

McLaren: ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ సూపర్ కార్ల సంస్థ ‘మెక్‌లారెన్’.. ధరలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

దేశీయ విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’ గత ఆగష్టులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ 9 రూట్లలో సర్వీసుల్ని నడుపుతోంది. ఇప్పుడు పదో మార్గంగా విశాఖ పట్నం-బెంగళూరును ఎంచుకుంది. ఈ రెండు నగరాల మధ్య ‘ఆకాశ ఎయిర్’ రోజుకు రెండు సర్వీసులు నడపబోతుంది. డిసెంబర్ 10న తొలి సర్వీసు ప్రారంభమవుతుంది. 12న రెండో సర్వీసు మొదలవుతుంది. ఆ తర్వాత నుంచి రోజూ రెండు సర్వీసులు నడుస్తాయి. ఈ సర్వీస్ ప్రారంభంతో బెంగళూరు నగరం నుంచి 8 నగరాలకు, రోజుకు 24 నాన్‌స్టాప్ సర్వీసులు ప్రారంభించినట్లు అవుతుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ నెల 26 నుంచి పుణె-బెంగళూరు మధ్య రెండు సర్వీసుల్ని ప్రారంభించబోతుంది.

Elon Musk: బైబై మస్క్ అంటున్న ఉద్యోగులు.. రిప్ ట్విట్టర్ అంటున్న యూజర్లు.. ఆందోళన లేదంటున్న మస్క్

అలాగే ఇదే రూట్లో డిసెంబర్ 10 నుంచి మూడో సర్వీస్ కూడా మొదలవుతుంది. ఇప్పటికే బెంగళూరు-అహ్మదాబాద్ మధ్య రెండు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే, డిమాండ్ దృష్ట్యా మూడో సర్వీసును కూడా ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. డిసెంబర్ 17 నుంచి ఈ రూట్లో మూడో సర్వీస్ మొదలవుతుందని కంపెనీ తెలిపింది.