Andhra Pradesh: అమరావతి కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

రాజధాని అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నిర్మాణాల కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే స్టే విధించింది.

Andhra Pradesh: అమరావతి కేసు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

Andhra Pradesh: ఏపీ రాజధాని అమరావతి అంశంపై గతంలో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై మాత్రమే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Ram Charan: అఫీషియల్.. బుచ్చిబాబుతో చరణ్ మూవీ కన్ఫం!

రాజధాని నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదన్న హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్న ఆధ్వర్యంలోని ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం.. నెల రోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు పూర్తి చేయాలన్న కాల పరిమితులపై స్టే విధించింది. అనంతరం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Trivikram: బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి ఆ కాంబినేషన్ వస్తుందా..?

‘‘హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? ఇలాంటి అంశాల్లో నైపుణ్యం లేకుండా ఆదేశాలిస్తారా? కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? మీరే ప్రభుత్వమైతే అక్కడ క్యాబినెట్ ఎందుకు? హైకోర్టు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తోందా?’’అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్, నిరంజన్ రెడ్డి, శ్రీరామ్ అనే న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరగా, కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విదించింది.