Chintamaneni Prabhakar : రాజధాని రైతుల పాదయాత్రపై రగడ.. మంత్రి కొట్టు సత్యనారాయణకు చింతమనేని సవాల్

మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్పారు.

Chintamaneni Prabhakar : రాజధాని రైతుల పాదయాత్రపై రగడ.. మంత్రి కొట్టు సత్యనారాయణకు చింతమనేని సవాల్

Chintamaneni Prabhakar : అమరావతి రైతుల మహా పాదయాత్రపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాదయాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు.

ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు అని ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతుల పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన తెలిపారు. సీఎం జగన్, మంత్రి కొట్టు సత్యనారాయణ ఫోటోలతో పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి.

అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించడంపై టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతుల పాదయాత్ర ఫేకో నిజమో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ నిజమైన మంత్రా? ఫేక్ మంత్రా? అనేది ప్రజలకు తెలుసన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక మంత్రికి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్పారు చింతమనేని ప్రభాకర్.

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర మంగళవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అమరావతి టు అరసవెల్లి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫేక్ రైతులు, ఫేక్ యాత్రికులు.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.

ఈ ఫ్లెక్సీలను స్థానిక మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏర్పాటు చేయించారని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ”అవగాహన లేమితో రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతున్నారు. అదే మూడు ముక్కలాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దుర్భుద్దితో మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేక్ పాదయాత్ర అని.. ఇదంతా చంద్రబాబే చేయిస్తున్నారని రకరకాలుగా ఆరోపిస్తున్నారు. కొట్టు సత్యనారాయణకు దమ్ముంటే తాడేపల్లిగూడెంలోని బ్రిడ్జిపై జనాన్ని పోగు చేసి రైతుల పాదయాత్ర నిజమో.. ఫేకో తేల్చాలన్నారు. అంత జనాన్ని పోగు చేసే దమ్ము కొట్టు సత్యనారాయణకు ఉందా” అని చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం, ఏమీ మాట్లాడకపోతే మంత్రి పదవి ఊడుతుందన్న భయంతోనే మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు.