Devineni Uma On Amaravati : సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉంది, అమరావతిని అంగుళం కూడా కదపలేరు-దేవినేని ఉమ

సీఎం జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉందని దేవినేని ఉమ చెప్పారు. అమరావతిని అంగుళం కూడా కదపలేరని చెప్పారు. మొండితనంతో, పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Devineni Uma On Amaravati : సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉంది, అమరావతిని అంగుళం కూడా కదపలేరు-దేవినేని ఉమ

Devineni Uma On Amaravati : సీఎం జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. సీఆర్డీఏ యాక్ట్ బలంగా ఉందని దేవినేని ఉమ చెప్పారు. అమరావతిని అంగుళం కూడా కదపలేరని చెప్పారు. మొండితనంతో, పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

”సీఎం జగన్ అసెంబ్లీలో ఎన్ని అబద్దాలు, అసత్యాలు చెప్పినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఆ ధ్యేయంతోనే చంద్రబాబు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశారు. ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఒకటే రాజధాని ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ప్రజా రాజధాని.

34వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారు. సీఆర్డీయే యాక్ట్ బలంగా పెట్టబడి ఉంది. ఆ యాక్ట్ కు అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా రైతుల హక్కులు పరిరక్షించబడుతున్నాయి. హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఆరు నెలలు మొద్దు నిద్రపోయాడు. ఆరు నెలల తర్వాత మొద్దు నిద్ర లేచి గోల చేయడం కరెక్ట్ కాదు” అని మాజీమంత్రి దేవినేని ఉమ అన్నారు.

ఏపీ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రాజధాని ఇష్యూ రాజకీయాల్లో హీట్ పెంచింది.

ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతే అని టీడీపీ చెబుతోంది. కాదు కాదు.. ఏపీ మూడు రాజధానులు అని అధికార వైసీపీ అంటోంది. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. త్వరలోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ పెడతామని చెబుతున్నారు. అభివృద్ది వికేంద్రీకరణే వైసీపీ సర్కార్ లక్ష్యం అంటున్నారు.

మరోవైపు రాజధాని అంశంపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని… ప్రభుత్వ నిర్ణయాన్ని ఆపేయాలనుకోవడం శాసన వ్యవస్థ అధికారాలను ప్రశ్నించడమే అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.