AP Government : నేడు ఏపీ కేబినెట్ ఉపసంఘం భేటీ..కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది.

AP Government : నేడు ఏపీ కేబినెట్ ఉపసంఘం భేటీ..కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష

Ap Cabinet Sub Committee Meeting Today

AP Cabinet Sub-Committee : ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలోని మంత్రి వర్గం చర్చించి తగిన సూచనలను కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఇవ్వనున్నారు.

మంగళగరిలోని ఏపీఐఐసీ భవనంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా ఉన్న ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సభ్యులుగా ఉన్నారు. సెకండ్‌ వేవ్‌లో పరిస్థితులపై మంత్రివర్గ ఉససంఘం సమీక్ష చేయనుంది. రాష్ట్రంలో కోవిడ్‌ నివారణ, పర్యవేక్షణ, వ్యాక్సినేషన్‌పై చర్చించనున్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య నిపుణుల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నారు.

మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇందుకు తగిన ప్రణాళికపైన కూడా చర్చంచనుంది మంత్రి వర్గ ఉపసంఘం. ఏపీలో 18ఏళ్లు నిండిన వారు నాలుగు కోట్ల 30 లక్షల మంది దాకా ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేయడం అన్నది ఇప్పుడు చాలా భారంతో కూడిన వ్యవహారం. వ్యాక్సిన్ల కొరత ఒకవైపు, వాటి ధరలు మరొకవైపు లక్ష్య సాధనకు స్పీడ్ బ్రేకర్లుగా ఉన్నాయి. దీంతో అందరికీ వ్యాక్సిన్ వేయడంలో సాధక బాధకాలను మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది.