AP CM : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో  భేటీ అయిన సీఎం.. ఏపీలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు...

AP CM : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Jagan

AP CM Jagan : ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యనటలో భాగంగా ఆయన ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మొదటి రోజు మోదీతో పాటు నిర్మలా సీతారామన్‌, జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ అయిన సీఎం.. మంగళవారం మరో ముగ్గురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో  భేటీ అయిన సీఎం.. ఏపీలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు, కేంద్ర విద్యా సంస్థలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, నూతన విద్యా విధానం అమలుపై చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఏడు మెగా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని..ఏపీకి కేటాయించాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

Read More : Telangana BJP : జైలులో బండి సంజయ్..బెయిల్ వస్తుందా ? రాదా .

కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తోనూ భేటీ అయ్యారు సీఎం. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి, ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు అంశాలపై దాదాపు అరగంట సేపు చర్చించారు. అంతకుముందు రోడ్డు, ఉపరితల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటి అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణపై గడ్కరీతో దాదాపు గంట సేపు చర్చించారు. సముద్ర తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపరం వరకు నేషనల్‌ హైవే, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటు పైనా చర్చించారు.