CM Jagan Vaccine : కరోనా వ్యాక్సిన్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. 4 రోజుల్లో 24లక్షలు టార్గెట్

కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి

CM Jagan Vaccine : కరోనా వ్యాక్సిన్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. 4 రోజుల్లో 24లక్షలు టార్గెట్

Cm Jagan Corona Vaccine

CM Jagan Corona Vaccine : కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కు సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆ సమయంలో రోజుకు కనీసం 6లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ తర్వాత కొవిడ్‌ వ్యాక్సిన్‌పై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన వ్యాక్సిన్‌ డోసులు కేంద్రాన్ని కోరాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్న సీఎం.. దీని కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్‌ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు.

ఏపీలో కరోనా తీవ్రరూపం:
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో మరోసారి 2వేల 765మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో 11మంది కరోనాకు బలయ్యారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 31వేల 892మందికి కరోనా టెస్టులు చేశారు. ఇక 1,245మంది కోవిడ్ ను జయించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,53,65,743 కరోనా టెస్టులు చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 9,2021) బులెటిన్ విడుదల చేసింది.

జిల్లాల వారిగా కరోనా కేసులు.. చిత్తూరు టాప్..
గడిచిన 24గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 490 కేసులు, విశాఖపట్నంలో 335, క్రిష్ణాలో 341, నెల్లూరులో 292, కడపలో 171, అనంతపురం జిల్లాలో 167, ప్రకాశం జిల్లాలో 161, శ్రీకాకుళం జిల్లాలో 100 కేసులు నమోదయ్యాయి.

* రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య – 9,15,702
* మొత్తం రికవరీల సంఖ్య – 8,92,001
* మొత్తం మరణాల సంఖ్య – 7,279
* యాక్టివ్ కేసులు – 16,422