అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ప్రభుత్వం రూ.5 వేల ఆర్ధిక సహయం

  • Published By: murthy ,Published On : May 26, 2020 / 07:54 AM IST
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ప్రభుత్వం రూ.5 వేల ఆర్ధిక సహయం

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫ్రభుత్వం  రూ. 5 వేల చొప్పున ఆర్ధిక  సహాయం అందచేసింది. ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని  క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేసారు.

ఈ కార్యక్రమం ద్వారా  రాష్ట్రంలోని 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లకు లబ్ది చేకూరుతుంది. ప్రభుత్వం ఇందుకోసం  రూ. 37.71 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లు హజరయ్యారు. అనంతరం అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు ప్రత్యేక ప్రార్ధనలు చేసి సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు.  

Read: ఏపీలోకి అక్రమంగా తెలంగాణ మద్యం.. పట్టుకున్న పోలీసులు