Andhra Pradesh : నేటితో ముగియనున్న 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం..తగ్గనున్నటీడీపీ బలం

ఏపీ శాసనమండలిలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కౌన్సిల్ లో స్ధానిక సంస్ధల కోటా కింద ఖాళీలు 11 కి చేరనున్నాయి.

Andhra Pradesh : నేటితో ముగియనున్న 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం..తగ్గనున్నటీడీపీ బలం

Andhra Pradesh

Andhra Pradesh : ఏపీ శాసనమండలిలో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కౌన్సిల్ లో స్ధానిక సంస్ధల కోటా కింద ఖాళీలు 11 కి చేరనున్నాయి. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావులు పదవీ విరమణ పొందుతుండ‌గా.. వైసీపీ నుంచి మండలిలో వైసీపీ చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రిటైర్ కానున్నారు.

టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో మండలిలో వైసీపీ సంఖ్యా బలం పెరగనుంది. కౌన్సిల్లో వైసీపీ సంఖ్యా బలం 21కి చేరనుండ‌గా.. టీడీపీ బలం 15కి పడిపోనుంది.  పరిషత్ ఎన్నికలను హై కోర్టు రద్దు చేయడంతో స్థానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కానుంది.

కాగా… ఇటీవలే ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ పదవులను భర్తీచేశారు. ఈ నెల 14న నలుగురు ఎమ్మెల్సీ లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసారు. దీంతో గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు ఎంపిక అయ్యారు.