AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా..

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

Ap New Districts

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు ఇతర ఆఫీసుల ఏర్పాటుకు భవనాలు గుర్తిస్తున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఉన్న ఏరియా ఆసుపత్రులను జిల్లా హాస్పిటల్స్ స్థాయికి పెంచుతున్నారు.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. ఉగాది నుంచే.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

విజయనగరం జిల్లాను విభజించి పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటు అవుతోంది. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త కలెక్టరేట్ భవన సముదాయం కోసం 15 ఎకరాల భూమిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. నిర్మాణం పూర్తయ్యేలోగా జిల్లా కలెక్టరేట్ కోసం కొత్తగా నిర్మిస్తున్న ఐటీడీఏ భవనాన్ని ఎంపిక చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని గుర్తించారు. మిగిలిన ఆఫీసుల కోసం భవనాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటు పార్వతీపురంలో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్ మెంట్లను అధికారుల నివాసల కోసం తీసుకునేందుకు వీలుగా నిర్మాణదారులతో చర్చలు జరుగుతున్నాయి.

AP New Districts Works Speeds Up

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3వ వరకు స్వీకరిస్తారు.

ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

AP New Districts Works Speeds Up

మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఆ తర్వాత మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు.

Ap New Districts : ఏపీలో కొత్త జిల్లాలు.. అభ్యంతరాలు, సూచనల పరిశీలనకు ప్రత్యేక కమిటీ

కొత్తగా ప్రకటించిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, పేర్లపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల్లో ఇప్పటికే కొన్ని వినతులు వచ్చాయి. వాటిని స్వీకరించి, ఆ అభిప్రాయాలను ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.