AP Covid – 19 : 24 గంటల్లో 517 మందికి వైరస్

24 గంటల వ్యవధిలో 517 మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid – 19 : 24 గంటల్లో 517 మందికి వైరస్

Ap Corona

AP Reports New Corona Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని గణాంకాలు చూస్తే తెలుస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 517 మందికి కరోనా సోకింది. ఎనిమిది మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Young Girl Raped By Father : 17 ఏళ్ళ బాలికపై తండ్రితో సహా 28 మంది అత్యాచారం..

రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,55,687 పాజిటివ్ కేసులకు గాను…20,34,796 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14 వేల 276 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6 వేల 615గా ఉందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 97మంది వైరస్ బారిన పడ్డారు. 38 వేల 786 శాంపిల్స్ పరీక్షించగా…517 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Read More : America : పక్షపాతం ఉందని చెప్పినా…జుట్టుపట్టి కిందకు లాగేసిన అమెరికా పోలీసులు

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 03. చిత్తూరు 97. ఈస్ట్ గోదావరి 88. గుంటూరు 84. వైఎస్ఆర్ కడప 26. కృష్ణా 71. కర్నూలు 05. నెల్లూరు 38. ప్రకాశం 38. శ్రీకాకుళం 06. విశాఖపట్టణం 31. విజయనగరం 02. వెస్ట్ గోదావరి 28. మొత్తం : 517.