12వేలు ఇస్తే చాలు.. ప్రతి నెల 3వేలు పెన్షన్… చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం, పెన్షన్‌ స్కీమ్‌ పేరిట 50కోట్లు వసూలు

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 12:53 PM IST
12వేలు ఇస్తే చాలు.. ప్రతి నెల 3వేలు పెన్షన్… చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం, పెన్షన్‌ స్కీమ్‌ పేరిట 50కోట్లు వసూలు

pension scheme cheating: చిత్తూరు జిల్లాలో పెన్షన్ స్కీమ్ పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి…చేతులెత్తేసిన రూపేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి 12వేల రూపాయలు చెల్లిస్తే నెల నెలా మూడు వేలు పెన్షన్ ఇస్తామని నమ్మబలికి రూపేష్ కుమార్…45వేల మంది నుంచి 50 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వందల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుని అక్రమాల పాల్పడ్డాడు.

డబ్బు వసూలైన తర్వాత కరోనా పేరు చెప్పి పెన్షన్ కింద ఇస్తామన్న మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. చిత్తూరు, కడప, అనంతపురంతో పాటు కర్నాటకలోనూ బాధితులను మోసం చేశాడు రూపేశ్ కుమార్. బాధితుల ఫిర్యాదుతో రూపేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత వదిలిపెట్టారు. దీంతో పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జనార్ధన్ నాయక్, కానిస్టేబుల్ గంగాధర్‌లను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.