Vishnuvardhan Reddy On Janasena : ఎవరినో సీఎంని చేయడానికి బీజేపీ-జనసేన సిద్ధంగా లేవు- విష్ణువర్ధన్ రెడ్డి

బీజేపీ, జనసేన బంధం ఫెవికాల్ కంటే బలమైనదని.. జనసేనతో బీజేపీ పొత్తుని విడదీయడం సాధ్యం కాదని అన్నారు.

Vishnuvardhan Reddy On Janasena : ఎవరినో సీఎంని చేయడానికి బీజేపీ-జనసేన సిద్ధంగా లేవు- విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy On Janasena

Vishnuvardhan Reddy On Janasena : పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరినో సీఎం చేయడానికి బీజేపీ-జనసేన సిద్ధంగా లేవన్నారాయన. తమ వైఖరి ఇదేనని ఆయన తేల్చి చెప్పారు. 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ-జనసేన కూటమిని అధికారంలోకి తేవడమే లక్ష్యం అన్నారు. బీజేపీ, జనసేన బంధం ఫెవికాల్ కంటే బలమైనదన్న విష్ణువర్ధన్ రెడ్డి.. జనసేనతో బీజేపీ పొత్తుని విడదీయడం సాధ్యం కాదన్నారు.

”బీజేపీ దృష్టిలో ఎవరూ అంటరాని పార్టీ కాదు. బీజేపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎవరైనా ముందుకొస్తామంటే వాళ్లు వచ్చి చెప్పాలి. 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే బీజేపీ లక్ష్యం. మాకు ఇక రెండో అభిప్రాయం లేదు. అయితే, మా భుజాల మీద ఎవరినీ మోసుకుపోయేందుకు సిద్ధంగా లేము. మేము ఎవరినీ ముఖ్యమంత్రులను చేసేందుకు సిద్ధంగా లేము. బీజేపీ జనసేన పొత్తు విడదీస్తే మాకు ఉపయోగపడుతుందని ఎవరైనా అనుకుంటే అది అత్యాశే అవుతుంది. అది సాధ్యం కాదు. మాది ఫెవికాల్ అంటే ఇంకా బలమైన బంధం” అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.(Vishnuvardhan Reddy On Janasena)

Pawan Kalyan Three Options : 3 ఆప్షన్లతో ముందుకొచ్చిన పవన్.. పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేనాని హాట్ కామెంట్స్

జూన్ 6న ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు బీజేపీ జాతీయ నేతలు వస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నడ్డా పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. నిన్న పవన్ కల్యాణ్ చెప్పినట్టు బీజేపీ-జనసేన కూటమి ఎవరికోసమో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలన్న తమ ఉద్దేశాన్ని చాటిచెప్పారు.

గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాల తప్పుల కారణంగా రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. నూతనంగా ఏర్పడినటు వంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

kvp ramachandra rao: పాచిపోయిన లడ్లు ఇచ్చారన్నారు.. అదే బీజేపీతో పవ‌న్‌ పొత్తులో ఉన్నారు: కేవీపీ రామచంద్రరావు

పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే చర్చనీయాంశంగా మారిన పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారాయన. ఈసారి జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ వెల్లడించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం.. బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం.. జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం.. ఇవీ తమ ముందున్న అవకాశాలు అని పవన్ కల్యాణ్ వివరించారు.

వచ్చే ఎన్నికల్లో విజయం అనేది పార్టీల మధ్య ఐక్యతపై ఆధారపడి ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిశామని, విజయం సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ చాలా సార్లు తగ్గిందన్న పవన్.. ఈసారి మాత్రం తగ్గేదే లేదని.. మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుందని హితవు పలికారు పవన్.

“టీడీపీ నేతలకు నేను ఒకటే చెబుతున్నా… బైబిల్ సూక్తిని మీరు కూడా పాటించండి. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును అని బైబిల్ లో ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ తగ్గే ఉంటుంది. పొత్తుల విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించవద్దు. ఈసారి ప్రజలే విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని పవన్ అన్నారు.