Polavaram Project : వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Polavaram Project : వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవం పూర్తికాలేదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL criticizes CM Jagan's government over Polavaram project

Polavaram Project : సీఎం జగన్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.ఏపీని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన జీవీఎల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఇది కేవలం చేతకానితనమేనంటూ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి కేంద్రం సహకారంతోనే ముడిపడి ఉందనే విషయాన్ని ఈసందర్భంగా జీవీఎల్ ప్రస్తావించారు.నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఇదికూడా చేతకాని తనమేనని విమర్శించారు. తన వ్యాఖ్యలు నిజం కాకపోతే సీఎం జగన్ ప్రభుత్వం తనతో చర్చించటానికి రావాలని సవాల్ విసిరారు.

విశాఖలో కబ్జాలు చేయటానికి మాత్రమే రాజధాని అంటున్నారంటూ జీవీఎల్ ఈ సందర్భంగా ఆరోపించారు. విశాఖలో భూకబ్జాలపై వైసీపీ ప్రభుత్వం చర్చకు సిద్దమా? అంటూ సవాల్ విసిరారాు జీవీఎల్. సిట్ రిపోర్టును వైసీపీ ఎందుకు బయటపెట్టటంలేదంటూ ప్రశ్నించారు. ఏపీలో ఉండే స్టార్టప్ కంపెనీలకు సహాకారం అందించటం కూడా వైసీపీ ప్రభుత్వానికి చేతకాలేదని ఇటువంటి అలసత్వంతో ఏపీలో అనేక ప్రాజెక్టులు నిర్వీర్యమైపోతున్నాయి అంటూ జీవిఎల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

గతంలో కూడా జీవీఎల్ వైసీపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా.. పట్టించుకోవడం లేదని వివరించారు. ఢిల్లీలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ఆధారమైన బయటపెట్టారా? అంటూ నిలదీశారు. మూడు రాజధానులు సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తెలుసు.. అయినా మూడేళ్ల క్రితం వేసిన క్యాసెట్టే మళ్లీ వేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేవి సాధ్యం కాదని జగన్ కు కూడా తెలుసు..తెలిసే కాలయాపన చేయటానికి..అభివృద్ధి చేయటం కూడా చేతకాని తనం బయటపడుతుందనే భయంతో ప్రజల్ని తప్పుదారి పట్టించటానికి మూడు రాజధానులు అంటూ డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు జీవీఎల్.