GVL On Elections : బీజేపీ నెక్ట్స్ టార్గెట్.. తెలుగు రాష్ట్రాలే-జీవీఎల్

42 లోక్ సభ స్థానాలున్న ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయని..(GVL On Elections)

GVL On Elections : బీజేపీ నెక్ట్స్ టార్గెట్.. తెలుగు రాష్ట్రాలే-జీవీఎల్

Gvl On Elections

GVL On Elections : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. నాలుగు చోట్ల ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ శ్రేణుల్లో మరింత కాన్ఫిడెన్స్ నింపాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 404 స్థానాలు అని ఆయన చెప్పారు. 404 స్థానాల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నాం అని తెలిపారు.(GVL On Elections)

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో 2024 ఎన్నికల వరకు బీజేపీ మరింత బలపడుతుందన్నారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించామని వెల్లడించారు. 42 లోక్ సభ స్థానాలున్న ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక మంది నేతలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని జీవీఎల్ చెప్పారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండనున్నాయని తెలిపారు. తెలంగాణ లో కాంగ్రెస్ బోర్డు మూసేయాల్సిన పరిస్థితి ఉందన్నారు జీవీఎల్.(GVL On Elections)

AP Cabinet : ఎన్నికల మూడ్‌‌లోకి ఏపీ ప్రభుత్వం..15న వైసీపీఎల్పీ భేటీ

ముందస్తు ఎన్నికల గురించి విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపైనా జీవీఎల్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. 6 నెలల తర్వాత ఓడుతామనుకునే వారు ముందుగా వెళ్లినా ఓడిపోయారని గుర్తు చేవారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళతారని అనుకోవడం లేదన్నారు. బీజేపీది ఓపెన్ డోర్ పాలసీ అన్న జీవీఎల్.. ఎవరు వచ్చినా పార్టీలోకి స్వాగతిస్తాం అన్నారు.

AAP Telangana : ఫుల్ జోష్‌‌లో ఆప్.. తెలంగాణపై ఫోకస్, త్వరలో పాదయాత్రలు

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపైనా జీవీఎల్ తనదైన శైలిలో స్పందించారు. మూడో ఫ్రంట్ ప్రయత్నం కాదు.. టీఆర్ఎస్ కు మూడిందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో మంచి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు జీవీఎల్.(GVL On Elections)

TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు

తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ‌లోనూ యూపీ త‌ర‌హా ఫ‌లితాలే రిపీట్ అవుతాయ‌ని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయ‌న చెప్పారు. యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్‌ ఉక్కుపాదం మోపార‌ని రాజా సింగ్ అన్నారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి కృషి చేశార‌ని.. ఈ కార‌ణంగానే యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని రాజా సింగ్ అభిప్రాయప‌డ్డారు. తెలంగాణలో కుటుంబపాలనకు తెరపడుతుందని, బీజేపీ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కి కలలోకి కూడా మోదీ వస్తున్నార‌ని.. నిద్ర‌లోనూ కేసీఆర్‌ ఉలిక్కిపడుతున్నార‌ని రాజా సింగ్‌ అన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా ఈసారి ఆ పార్టీ ఖతం అవుతుందని ఆయన అన్నారు.