అమ్మ చంద్రబాబూ..! అక్కడ సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి

  • Published By: sreehari ,Published On : February 14, 2020 / 10:13 AM IST
అమ్మ చంద్రబాబూ..! అక్కడ సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి

ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి బొత్స చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీ, పూణె సహా 40 చోట్ల సోదాలు జరిగాయని అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద అక్రమ లావాదేవీలను గుర్తించినట్టు తెలిపారు. సోదాలపై స్పష్టత ఇస్తూ ఐటీ శాఖ లేఖ విడుదల చేసిందని అన్నారు.

అమ్మ చంద్రబాబు నాయుడూ.. ఎంతటి ఘనుడవయ్యా.. మేం మొదటి నుంచే చెప్పుకొస్తున్నామన్నారు. ఏదైనా అమరాతి పేరుపైనా రాజధానిని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యవస్థగా వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని బొత్స ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రూ.46వేల కోట్ల అవినీతి జరిగినట్టు బొత్స వెల్లడించారు.

ఎన్నికలకు ముందే రూ.46వేల కోట్లకు టెండర్లు పిలిచారని అన్నారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, తమకు అభివృద్ధి ముఖ్యమన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. పేదల ఇళ్ల పేరుతో కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడరని ఆరోపించారు. చంద్రబాబు ఏ విధంగా దోచుకున్నారో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేయాలని బొత్స చెప్పారు.

40 చోట్ల సోదాలు చేస్తే.. రూ.2వేల కోట్లు ఇక్కడి నుంచి విదేశాలకు పోయి అక్కడి నుంచి ఇక్కడికి లావాదేవీలు జరిగినట్టు గుర్తించారని చెప్పారు. ట్యాక్సులు ఎగ్గొట్టమే కాకుండా అవినీతి కార్యాక్రమాలు కూడా జరిగాయని బొత్స విమర్శించారు. శ్రీనివాసన్ అనే వ్యక్తి ప్రముఖ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా ఐటీ సోదాల్లో తేలిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ కుంభకోణాన్ని  ఆదాయపన్ను శాఖ(ఐటీ) శాఖ బయటపెట్టిన సంగతి తెలిసిందే. 40కి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించారు. మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలపై వచ్చిన ఆరోపణలతో..  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో ఏక కాలంలో సోదాలను నిర్వహించింది ఐటీ శాఖ. వీటితో పాటు ఓ కీలక రాజకీయ నేతకు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో అధికారులకు.. కీలక ఆధారాలు, పత్రాలు లభించాయి. 

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!