Boy Friend : ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు, ప్రియురాలిపై పెట్రోల్  పోసి నిప్పంటించాడు. జిల్లాలోని గుడ్లూరు మండలం  మోచర్ల  గ్రామంలో నివసించే సుమతికి గతంలోనే వివాహం అయ్యి,  భర్త నుంచ

Boy Friend : ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Prakasam District

Boy Friend : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు, ప్రియురాలిపై పెట్రోల్  పోసి నిప్పంటించాడు. జిల్లాలోని గుడ్లూరు మండలం  మోచర్ల  గ్రామంలో నివసించే సుమతికి గతంలోనే వివాహం అయ్యి,  భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది.  ఈ క్రమంలో ఆమెకు రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

రాజుకు గతంలో వివాహం అయి భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో వారిద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇటీవలి కాలంలో విభేధాలు  పొడసూపాయి. ప్రియుడు రాజు  ఈరోజు సుమతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో  రాజుకు కూడా నిప్పంటుకుని తీవ్రగాయాలయ్యాయి.
Also Read : Telangana : దొడ్డి దారిన సీఎం అయిన మీకేం తెలుసు కేసీఆర్ గురించి-ధ్వజమెత్తిన తెలంగాణ మంత్రులు
వీరి ఆక్రందనలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి వెంటనే ఇద్దరినీ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రియురాలు సుమతి పరిస్ధితి విషమంగా ఉండటంతో ఆమెను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రియుడు రాజును ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.