Chandrababu On Debts : రూ.8లక్షల కోట్లు అప్పులు, కుటుంబంపై రూ.లక్ష భారం-జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.

Chandrababu On Debts : రూ.8లక్షల కోట్లు అప్పులు, కుటుంబంపై రూ.లక్ష భారం-జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu On Debts

Chandrababu On Debts : మహానాడు వేదికగా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. సీఎం జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం రూ.8లక్షల కోట్లు అప్పులు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ కారణంగా ఒక్కో కుటుంబపై లక్ష రూపాయల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లల్లో జగన్ అవినీతి రూ. 1.70 లక్షల కోట్లు అని ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో రైతుల పరిస్ధితి దయనీంగా ఉందని చంద్రబాబు వాపోయారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న చంద్రబాబు… వైసీపీకే ఉరేయాలన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు.

Nara Lokesh: చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు: నారా లోకేష్

”ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? జగన్ ఆ అప్పులు తీరుస్తారా..? జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా. భూముల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. భూముల విషయంలో లిటిగేషన్లు పెట్టేసి అమ్మేస్తున్నారు. ప్రజలు తమ భూములను కాపాడుకోవాలి” అని చంద్రబాబు సూచించారు.

Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..