CM Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం |CM Jagan good news for the unemployed .. Order to replace 8 thousand posts

CM Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెంట్ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

CM Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం

CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెంట్ పై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్ మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై అధికారులతో సమీక్షించారు.

Andhra Pradesh: 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త.. ఫైల్‌పై జ‌గ‌న్ సంత‌కం

2021–22లో 39,654ల పోస్టుల భర్తీ చేసినట్లు అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తయ్యాయని, 16.5శాతం పోస్టులను(సుమారు 8వేల పోస్టులు) ఇంకా భర్తీచేయాల్సి ఉందని, భర్తీ చేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

Minister Kishan Reddy: ’అగ్నిపథ్‌‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..
జగన్ మాట్లాడుతూ.. జాబ్‌ క్యాలెండర్ లో నిర్దేశించుకున్న పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని జగన్ సూచించారు.

×