AP Assembly : వివేకా హత్య..ఒక కన్నును మరో కన్ను ఎలా పొడుచుకుంటుంది ? – సీఎం జగన్

ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందన్నారు. అసలు వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరగలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.

AP Assembly : వివేకా హత్య..ఒక కన్నును మరో కన్ను ఎలా పొడుచుకుంటుంది ? – సీఎం జగన్

Ys Viveka

YS Viveka Case : వైఎస్ వివేకా హత్యపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ఆయన హత్యపై టీడీపీ పలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ స్పందించారు. ఒక కన్ను ఇంకో కన్నును ఎందుకు పొడుచుకుంటుందన్నారు. అసలు వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది ? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరగలేదా ? అని సూటిగా ప్రశ్నించారు.

Read More : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని..అప్పుడు తాము ప్రతిపక్షంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు చేశారు. చిన్నాన్న, అవినాష్‌రెడ్డిలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని తెలిపారు. ఇందులో టీడీపీ వారే ఏదైనా చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారాయన. అంతేగాకుండా..అవినాష్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు చేస్తున్న విషయన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన మరో చిన్నాన్న కొడుకని, అలాంటి ఘటన ఎవరైనా చేస్తారా అంటూ మరోసారి ప్రతిపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడారు.

Read More : CM Jagan : బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – సీఎం జగన్

చిన్నాన్న విషయంలో టీడీపీ చేసిన పనులను ఆయన సభలో ప్రస్తావించారు. తమ పార్టీ నుంచి పోటీలోకి దింపితే…ఆయన్ను ఓడించడం కోసం..ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కడప జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమ పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉంటే…వారికి డబ్బులు ఇచ్చి…ఎన్నో కుయుక్తులను పన్ని చిన్నాన్నను ఓడించారన్నారు. చిన్నాన్న హత్య విషయంలో టీడీపీ నేతలు వక్రీకరించి..ఏదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తమ కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమని తెలిపారు.