Andhra Pradesh Covid : 24 గంటల్లో 6 వేల 151 కరోనా కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు.

Andhra Pradesh Covid : 24 గంటల్లో 6 వేల 151 కరోనా కేసులు

Ap Covid 19

Corona Cases In AP : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 6 వేల 151 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 69 వేల 831 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 167 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1244 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,30,007 పాజిటివ్ కేసులకు గాను 17,48,009 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-
చిత్తూరులో 12 మంది, ప్రకాశంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, కృష్ణాలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్టణంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 359. చిత్తూరు 937. ఈస్ట్ గోదావరి 1244. గుంటూరు 331. వైఎస్ఆర్ కడప 478. కృష్ణా 424. కర్నూలు 203. నెల్లూరు 274. ప్రకాశం 554. శ్రీకాకుళం 264. విశాఖపట్టణం 237. విజయనగరం 199. వెస్ట్ గోదావరి 647.  మొత్తం : 6,151