AP Covid-19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.

AP Covid-19 : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Andhra Pradesh Corona

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది. 96 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 2, 03, 762 యాక్టివ్ కేసులు ఉండగా..10 వేల 222 మంది చనిపోయారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2 వేల 652 కొత్తగా కరోనా కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 15,90,926 పాజిటివ్ కేసులకు 13, 76, 942 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2, 03, 762గా ఉంది. గడిచిన 24 గంటల్లో 18 వేల 373 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1, 86, 76, 222 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, కర్నూలులో 10 మంది, విజయనగరంలో 10 మంది, అనంతపూర్ లో 9 మంది, తూర్పుగోదావరిలో 8 మంది, విశాఖపట్టణంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1047. చిత్తూరు 1620. ఈస్ట్ గోదావరి 2652. గుంటూరు 670. వైఎస్ఆర్ కడప 874. కృష్ణా 274. కర్నూలు 856. నెల్లూరు 503. ప్రకాశం 703. శ్రీకాకుళం 864. విశాఖపట్టణం 1690. విజయనగరం 535. వెస్ట్ గోదావరి 706. మొత్తం : 12,994.

Read More : Solar Storms Back : భూమిపై జీవం మనుగడకు ముప్పు.. సౌర తుఫానులు తిరిగి వచ్చేశాయి..