Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమ‌న‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ తదితర అంశాలను విచారించడానికి ఏర్పాటైన శాసనసభా సంఘం ఇవాళ మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఈ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం భూమ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు వివ‌రాలు తెలిపారు.

Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమ‌న‌

Bhumana Karunakar Reddy

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ తదితర అంశాలను విచారించడానికి ఏర్పాటైన శాసనసభా సంఘం ఇవాళ మ‌రోసారి స‌మావేశం నిర్వ‌హించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఈ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం భూమ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు వివ‌రాలు తెలిపారు. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి గ‌త‌ చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింద‌ని ఆరోపించారు. ఆ డేటాను పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని టీడీపీ చూసింద‌ని అన్నారు. అప్పటి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామని చెప్పారు.

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

డేటా చౌర్యం వెనుక చాలా మంది పెద్దవాళ్ళ సహకారం ఉందని అన్నారు. పెద్దవాళ్ళు సమాచారం దొంగిలించి కుట్ర చేశారని ఆయ‌న తెలిపారు. కింది స్థాయి ఉద్యోగులు ఈ నేరం చేయలేదని అన్నారు. 35 నుంచి 40 లక్షల ఓట్లు తొలగించాలని భావించి.. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహసం చేసిందని చెప్పారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు. ఈ కుట్రను తాము అడ్డుకున్నామ‌ని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం పనిగట్టుకుని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న త‌మ‌ను అధికారంలోకి రాకుండా చేయాలని కుట్ర పన్నింద‌ని తెలిపారు.

Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్ర‌మ్స్ వాయించిన భార్య ల‌త.. వీడియో

డేటా ఇతర మార్గాల ద్వారా బయటికి వెళ్ళే అవకాశం లేదని అధికారులు విచారణలో స్పష్టం చేశారని చెప్పారు. హోం శాఖ, ఐటీ శాఖ, పోలీస్ శాఖ అధికారులను విచారించామ‌ని అన్నారు. సేవామిత్ర యాప్ ద్వారా ఇంటింటి సర్వే చేసి ఓటర్ల అభిప్రాయాల ఆధారంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని గుర్తించార‌ని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డేటా చోర్యం నేరమ‌ని అన్నారు. దీనిపై పోలీస్ దర్యాప్తు కూడా జరగాలని చెప్పారు. ఇది పెగాస‌స్‌పై విచారణ కాదని, డేటా చౌర్యంపై విచారణ అని ఆయ‌న తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సీఎంకు, స్పీకర్‌కు నివేదిక ఇస్తామ‌ని అన్నారు.