అమరావతిపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు..సుజనాకు సోము కౌంటర్

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 12:44 PM IST
అమరావతిపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు..సుజనాకు సోము కౌంటర్

ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారో లేదో..దూకుడు ప్రదర్శిస్తున్నారు సోము వీర్రాజు. కన్నా స్థానంలో ఆయన్ను బీజేపీ అధినాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తూనే..పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా స్పందిస్తున్న వారిని తీవ్రంగా పరిగణించాలని భావిస్తున్నారు.



అనుకున్నట్లుగానే..టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ సుజనా చౌదరి రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. దీనికి సోము వీర్రాజు కౌంటర్ ఇవ్వడం ఆ పార్టీలో హాట్ హాట్ చర్చలు జరుుగుతున్నాయి. సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానం కాదు అని వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ 2020, జులై 31వ తేదీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని విషయం కేంద్ర పరిధిలో ఉందని అనడం పార్టీ యొక్క అభిప్రాయం కాదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. కేంద్రాన్ని సంప్రదించి..గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని సుజనా చెప్పడం విశేషం.



టీడీపీ నుంచి వచ్చిన వారితో సోమూ వీర్రాజు మొదటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారని టాక్. పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన బీజేపీ అధినాయకత్వాన్ని కోరనున్నారని ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల విషయంలో సోమూ చేసిన ప్రకటనకు భిన్నంగా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తప్పుబట్టడం..ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.

ఇదిలా ఉంటే…ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత..2020, జులై 31వ తేదీ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీకి సంబంధించిన పెద్దలను ఆయన కలువనున్నరు. పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియచేయనున్నారు.