మంత్రిని మెచ్చుకున్న సీఎం జగన్ : ఇంగ్లీషు మీడియా అమలు ఇలా

  • Published By: madhu ,Published On : December 12, 2019 / 11:02 AM IST
మంత్రిని మెచ్చుకున్న సీఎం జగన్ : ఇంగ్లీషు మీడియా అమలు ఇలా

వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యాభ్యాసాన్ని తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే నాడు – నేడు పేరిట..ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇందుకు నిధులు కేటాయించామన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు భాష విద్యాబోధనపై చర్చ జరిగింది. సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు నరేష్‌ను మెచ్చుకున్నారు. ఉన్నత విద్యనభ్యసించారని సభకు తెలిపారు. 

ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలోకి వెళ్లాలన్నా..ఇతర దేశాలతో పోటీ పడాలన్నా..ఇంగ్లీషు భాష తప్పనిసరి.
ఛాలెంజెస్ ఉంటాయని, దీనిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం.
1 క్లాస్ నుంచి 6..ఇలా పదో తరగతి వచ్చే సరికి ఇంగ్లీషు భాషపై విద్యార్థికి పట్టు. 
టీచర్లకు ట్రైనింగ్ విషయంలో 30 కీ రీసోర్స్ పర్సన్స్ ఎంపిక. 
మండలానికి నలుగురు టీచర్లను ఎంపిక…ట్రైనింగ్. 
 

ఫస్ట్, సెకండ్ లెవల్ ట్రైనింగ్. 
జూన్ 2020, ఆగస్టు 2020 నెలల్లో పది వారాల పాటు క్లాస్ 1, క్లాస్ 2కు బ్రిడ్జీ కోర్సులు కండక్ట్. 
జూన్ 2020, జులై 2020లో క్లాస్ 3, క్లాస్ 4లకు 8 వారాల పాటు బిడ్జీ కోర్సులు కండక్ట్.
ఏప్రిల్, మే నెలలో క్లాస్ 5, క్లాసు 6లకు రెండు నెలల పాటు ఇంటెన్సివ్ బ్రిడ్జీ కోర్సు. 
మంచి అధికారులు, ఉన్నత చదువు చదివిన మంత్రి ఉన్నారని, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలన్నారు సీఎం 
Read More : ఇంగ్లీషు లాంగ్వేజ్ లొల్లి : బాబుది ద్వంద్వ వైఖరి..నిలదీసిన సీఎం జగన్