ఏపీలో 8కి పెరిగిన కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో తొలి కేసు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా

  • Edited By: veegamteam , March 24, 2020 / 03:57 PM IST
ఏపీలో 8కి పెరిగిన కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో తొలి కేసు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో తొలి కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్విమ్స్ వైద్యులు మంగళవారం(మార్చి 24,2020) నిర్ధారించారు. ఆ యువకుడు ఇటీవలే ఇంగ్లండ్ నుంచి వచ్చాడు.

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలకు విస్తరించింది. మార్చి 24 మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 4 లక్షలకు చేరుకున్నాయి. మృతుల సంఖ్య 17వేలు దాటింది. లక్షమంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దేశంలో ఇప్పటివరకు 491 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 9 మంది మరణించారు. 36 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 89 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దర చనిపోయారు. కేరళలో 99మందికి ఈ వ్యాధి సోకింది. తెలంగాణలో ఇప్పటివరకు 36 మందికి కరోనా సోకింది. వీరిలో ఒకరికి వ్యాధి నయమైంది. మంగళవారం(మార్చి 24,2020) 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, చైనాలో 78 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 మంది విదేశాల నుంచి వచ్చినవారు. పాకిస్తాన్‌లో సోమవారం సాయంత్రం వరకు 878 కరోనా కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌లో 33 మందికి కరోనా సోకిందని నిర్థరణ అయింది. మూడు మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో సోమవారం మరో 602 మంది కరోనాకు బలయ్యారు. మృతుల సంఖ్య 6,078కి చేరింది. స్పెయిన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. కొత్తగా నమోదైన 514 మరణాలతో ఇక్కడి కోవిడ్-19 మృతుల సంఖ్య 2,696కు చేరింది. స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకరాం ఇప్పటివరకు ఆ దేశంలో 39,637 కరోనా కేసులు నమోదయ్యాయి.