జగన్ మళ్లీ టికెట్ ఇస్తారా? మంత్రులు, ఎమ్మెల్యేలలో టెన్షన్.. సీఎం చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్

మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

జగన్ మళ్లీ టికెట్ ఇస్తారా? మంత్రులు, ఎమ్మెల్యేలలో టెన్షన్.. సీఎం చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్

CM Jagan : మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. సమావేశంలో జగన్ ఎలాంటి క్లాస్ తీసుకుంటారోనని ఎమ్మెల్యేలు, మంత్రులు తెగ టెన్షన్ పడుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలు పెట్టి మూడు నెలలు పూర్తి కావడంతో ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ పై సర్వే చేయించారు సీఎం జగన్. ఆ సర్వే నివేదికల ఆధారంగా సమావేశంలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.

తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇంచార్జులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందన్న జగన్.. తామేం చేశామో ప్రజలకు నేరుగా చెప్పాలని జగన్ ఎప్పుడో ఆదేశించారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులు గడపగడపకు వెళ్లారు.

ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే సీఎం జగన్ చేతికి రిపోర్టులు అందాయి. ఎవరెవరు ఎన్ని గడపలు చుట్టూ తిరిగారు, ఎవరు దూరంగా ఉన్నారనే చిట్టా మొత్తం సీఎం జగన్ దగ్గరుంది. ముఖ్యంగా ప్రజల నుంచి ఏ నేతపై ఎలాంటి రెస్పాన్స్ ఉందన్న దానికి సంబంధించి ఐ-ప్యాక్ టీమ్ ఒక సర్వే కూడా చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమై మూడు నెలలు పూర్తి కావడంతో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టుని సీఎం జగన్ కు అందించింది ప్రశాంత్ కిషోర్ టీమ్. ఇప్పుడు వాటి ఆధారంగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై సీరియస్ గా ఉన్న సీఎం జగన్.. వారికి వార్నింగ్ కూడా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. రివ్యూ మీటింగ్ లో సీఎం జగన్ ఎలాంటి విషయాలు బయటపెడతారు? ఏం చెబుతారు? అనే విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు.

పనితీరు మార్చుకోకపోయినా, గడపగడపకు కార్యక్రమంలో సరిగా పాల్గొనకపోయినా సరే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని చాలాసార్లు చెప్పారు కూడా.