Vallabhaneni Vamsi: అవి మెరుపు కలలు మాత్రమే .. సీఎం జగన్ సమీక్షకు గైర్హాజరుపై స్పందించిన వల్లభనేని వంశీ

స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణం. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టం అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.

Vallabhaneni Vamsi: అవి మెరుపు కలలు మాత్రమే .. సీఎం జగన్ సమీక్షకు గైర్హాజరుపై స్పందించిన వల్లభనేని వంశీ

Gannavaram MLA Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి  (AP CM Jaganmohan Reddy) సోమవారం అమరావతి (Amaravati) లోని సీఎం క్యాంపు కార్యాలయం (CM Camp Office) లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యే (YCP MLAs)లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరవటం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో సీఎం సమీక్షకు గైర్హాజరుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram MLA Vallabhaneni Vamsi) స్పందించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ (Indian School of Business)లో కోర్సు చేస్తున్నానని, ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదని చెప్పారు. సీఎం సమీక్షకు హాజరుకాకపోయే సరికి నేను, కొడాలి నాని (Kodali Nani) పార్టీ మారుతున్నామంటూ కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారన్న వంశీ.. అవి మెరుపు కలలు మాత్రమేనని, అటువంటి పరిస్థితి లేదు, ఉండదని అన్నారు.

Vallabhaneni Vamsi : టీడీపీని స్థాపించింది పెద్ద ఎన్టీఆర్, దానికి వారసుడు జూ.ఎన్టీఆర్- వంశీ

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై మాట్లాడుతూ.. ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయని, పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడు వైసీపీ పోటీ పడలేదని, అందుకనే టీడీపీకి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు వచ్చాయని వంశీ అన్నారు. స్థానిక సంస్ధల కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయని, అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణమని వంశీ ఆరోపించారు. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టం అని వ్యాఖ్యానించారు.

YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ.. పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చిన సీఎం

టీడీపీ నాయకుల నుండి డబ్బులు ఖర్చు పెట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నాడని వంశీ విమర్శించాడు. మాతో వైసీపీ నాయకులు టచ్‌లో ఉన్నారంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తూ మైండ్ గేమ్ మాత్రమే ఆడుతున్నారని, అంతిమంగా ఓట్లు వేసి గెలిపించేది ఓటర్లు మాత్రమేనని వంశీ అన్నారు. చంద్రబాబు నాయుడును చూసి ఓట్లు వేయని వారు లోకేష్ సుందర మోకారవిందాన్ని చూసి ఓట్లు వేస్తారా అంటూ వంశీ ప్రశ్నించారు.