TTD Eo dharma reddy: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నరలోపే సర్వదర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

TTD Eo dharma reddy: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నరలోపే సర్వదర్శనం

Ttd Eo

TTD Eo dharma reddy: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంటన్నరలోపే భక్తులకు సర్వదర్శనం చేయించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా దర్శనంతో పాటు వివిధ సేవల టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉన్నందని చెప్పారు.

TTD: టీటీడీ ఉద్యోగిపై దాడి.. నిందితుడు అరెస్ట్

రెండున్నరేళ్లలో రూ.1,500 కోట్ల విరాళాలు వచ్చాయని, హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిరుమలలో ఉన్న 7,500 గదులకు మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు 4,500 గదుల మరమ్మతులు పూర్తికాగా మరో 750 గదుల పనులు జరుగుతున్నాయని చెప్పారు.

TTD: టీటీడీ ట్రస్టులకు ఒకేరోజు రూ.10 కోట్ల విరాళం

గత రెండు నెలల క్రితం వరు టైమ్ స్లాట్ ద్వారా శ్రీవారి దర్శనం బుక్ చేసుకునేవారని, అయితే, తోపులాటలు జరగకుండా క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శ్రీ భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం ప్రాంతాల్లో టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలను అనుమతించడం లేదని టీటీడీ  ఈవో తెలిపారు.