Minister Roja : జగన్, ఆయన ఫ్యామిలీ జోలికొస్తే నాలుక కోస్తా-మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్

సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్న రోజా.. చంద్రబాబు, లోకేశ్ ఆయన గుర్తింపు కోసం ఏం చేశారని ప్రశ్నించారు.

Minister Roja : జగన్, ఆయన ఫ్యామిలీ జోలికొస్తే నాలుక కోస్తా-మంత్రి రోజా స్ట్రాంగ్ వార్నింగ్

Minister Roja : సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్న రోజా.. చంద్రబాబు, లోకేశ్ ఆయన గుర్తింపు కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకి వైసీపీ పెట్టిందని గుర్తు చేశారు. నాడు నరకాసురుడిపై మహిశాసురమర్దిని విజయానికి ప్రతీకగా దసరా ఉత్సవాలు జరుపుకుంటుంటే, నేడు నారాసురుడిని జగన్ జయించడంతో మహిళా సాధికారత ఉత్సవాలు చేస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు మంత్రి రోజా.

”సీఎం జ‌గ‌న్‌ను గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను గానీ విమ‌ర్శించే వారి నాలుక కోసి ఉప్పూ కారం పెడ‌తా. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేదు. రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త వైసీపీదే. అయ్య‌న్నపాత్రుడు లాంటి నేత‌లు సైకోల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటి నేత‌ల‌ను త్వ‌ర‌లో పిచ్చాసుప‌త్రిలో చేర్చ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తించాలి. అయ్య‌న్న వ్యాఖ్య‌లు చూస్తే… ఆయ‌న వ‌య‌సుకు గానీ, ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వుల‌కు గానీ గౌర‌వం ఇవ్వ‌లేక‌పోతున్నాం. రాజ‌కీయంగా స‌మ‌స్య‌లు దొర‌క‌లేద‌ని జ‌గ‌న్ కుటుంబంపై విమ‌ర్శ‌లు చేస్తే ఇక‌పై స‌హించ‌బోమ‌ని” హెచ్చ‌రించారు మంత్రి రోజా.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”టీడీపీది అనవసరమైన రాద్దాంతం. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేశ్ కానీ, బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కు పేరు తెచ్చే విధంగా ఒక బిల్డిండ్ అయినా కట్టారా? ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? ఎన్టీఆర్ పేరుతో ఒక మంచి వెల్ఫేర్ స్కీమ్ అయినా వారి బుర్రల్లో వచ్చి వచ్చిందా? వాళ్లకి ఎన్టీఆర్ మీద అభిమానం లేదు. కేవలం ప్రతిదాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నారు తప్ప మరొకటి కాదనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మీడియా కూడా అర్థం చేసుకోవాలి” అని మంత్రి రోజా అన్నారు.