Minister Seediri Appalaraju : గన్నవరం గొడవల వెనుక కుట్ర, మంత్రి పదవికి రాజీనామా చేస్తా- సీదిరి అప్పలరాజు

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు.

Minister Seediri Appalaraju : గన్నవరం గొడవల వెనుక కుట్ర, మంత్రి పదవికి రాజీనామా చేస్తా- సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju

Minister Seediri Appalaraju : టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు.

వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చూస్తే అర్థమవుతుందని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. 68 శాతం వెనుకబడిన వారే ఎమ్మెల్సీలుగా ఉన్నారని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వడ్డెరలను అణగదొక్కుతోందని నారా లోకేశ్ చేసిన విమర్శలను మంత్రి ఖండించారు. మిస్టర్ మా లోకం.. వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెడుతున్నాం అని కౌంటర్ ఇచ్చారు. మీ నాన్న బీసీలకు ఎంత న్యాయం చేశారో చూడు అని సూచించారు.(Minister Seediri Appalaraju)

”నాయీ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తా అన్నారు, చెప్పుల వారికి తోలు తీస్తా అన్నాడు. బీసీలకు చంద్రబాబు చేసిన అన్యాయం ఎవరూ చేయలేదు. అధికారం పోయి ప్రతిపక్షంలో ఉన్నా సరే బీసీలపై ఆక్రోశం తగ్గలేదు. ఇంగ్లీష్ మీడియం మేము తెస్తామంటే అడ్డుకోవాలని చూశారు చంద్రబాబు. పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకుండా చేశారు. బీసీలకు 34% కోటా ఇస్తామంటే కోర్టుకెళ్లారు. సిగ్గుమాలిన రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు.

Also Read..Harirama Jogaiah Survey: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన హరిరామ జోగయ్య

లబ్దిదారులకు డబ్బులిచ్చే కార్యక్రమాలను సైతం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాసి ఏపీకి డబ్బులు ఇవ్వొద్దన్నారు. పేదల మీదా మీ ప్రతాపం. రాబోయే ఎన్నిక పేదవారికి పెత్తందారులకు మద్య జరిగే ఎన్నిక. వెనుకబడిన మత్స్యకార కుటుంబ సోదరుడిగా చెబుతున్నా. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని మట్టికరిపించాలి. చంద్రబాబు వల్ల సమాజానికి ప్రమాదం.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, సోదరులు గమనించాలి. అంబేద్కర్ సమయంలో అంటరానితనంపై పోరాడారు. జగన్ వచ్చే వరకు స్కూల్స్, ఆసుపత్రులు ఎలా ఉండేవో తెలుసు. అంటరానితనం, వెనుకబాటుతనం ఇవన్నీ జగన్ పాదయాత్రలో చూశారు. సామాజిక అసమానతలు తగ్గాలంటే జనాభా ప్రాతిపదికన పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. వెనుకబడిన వారికి రాజ్యాధికారం ఇచ్చి ముందువరసలో కూర్చోబెడుతున్నారు.

చంద్రబాబు అప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అంటరాని వారిగానే చూశాడు. అలాంటి వారికి ఏ శిక్ష విధించాలి. అసలు రాజకీయాలకు పనికి వస్తారా చంద్రబాబు? ఒక్క బీసీని రాజ్యసభకి కూడా పంపలేదు చంద్రబాబు. పదవులన్నీ చంద్రబాబు అమ్ముకునేవారు. మేము నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. టీడీపీ నేతలకు చాలెంజ్ చేస్తున్నా. మీ ఆదరణ పథకం వల్ల బాగుపడినటువంటి ఒక్క బీసీ కుటుంబాన్ని చూపించండి.

Also Read..Gannavaram High Tension : పట్టాభి తొందరపాటు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శాంతి భద్రతలకు విఘాతం.. కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా

గన్నవరంలో ఏదో జరిగిపోతోందని హడావుడి చేస్తున్నారు. లోకేశ్ నువ్వు పిల్ల బచ్చా. నీ స్థాయి ఏంటి? జగన్ స్థాయి ఏంటి? అన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు మాపై. మీరు తిడతా ఉంటే మేం చేతులు కట్టుక కూర్చోవాలా? ఒక్కొక్కరికి తాట తీసే రోజులు దగ్గర్లో ఉన్నాయి. మేం కన్నెర్ర చేస్తే మీరు నియోజకవర్గాల్లో తిరగగలరా? పట్టాభిని ఎవడైనా కిడ్నాప్ చేయగలడా? ఆయనేమైనా చిన్నపిల్లడా? మాటలతో రెచ్చగొడుతున్నారు. అల్లరి మూకలను చంద్రబాబు అదుపులో పెట్టాలి. గన్నవరం గొడవలకు కుట్ర చంద్రబాబే చేశాడు.

క్యాబినెట్ మార్పు ముఖ్యమంత్రి విచక్షణాధికారం. ఎమ్మెల్యేలు అందరూ మంత్రి స్థాయి వారే. సామాజిక వర్గాల ఆధారంగా కూర్పు జరుగుతుంది. కొన్ని కులాలకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇష్యూ చేస్తున్నారు. కులాల కూర్పులో ముఖ్యమంత్రికి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను రాజీనామా చేసేందుకు సిద్దం. నాకు సరైన గౌరవం ఇచ్చారు. ఇంతకంటే ఏం కావాలి. మత్స్యకారులకు ఎంతో గౌరవం ఇచ్చారు జగన్. చంద్రబాబు బెదిరిస్తే, జగన్ మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్ బహుజన పార్టీ మాది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తారకరత్నది సడెన్ కార్డియాక్ అరెస్ట్. ఆసుపత్రికి వెళ్లేసరికి కార్డియక్ యాక్టివిటీ లేదని ఓ డాక్టర్ గా అనుకుంటా. బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చు. రికవరీ అవ్వక చనిపోయుంటారు. కుటుంబసభ్యులు సరైన సమాచారం ప్రజలకు ఇవ్వలేదు. లోకేష్ పాదయాత్రకు అపశకునం అనే సమాచారం ఇవ్వలేదేమో. చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆపాలి. పరిపాలన ఎక్కడి నుండి జరుగుతుందో దాన్ని పరిపాలనా రాజధాని లేదా రాజధానిగా పరిగణిస్తాం” అని మంత్రి సీదిరి అప్పలరాజు తేల్చి చెప్పారు.