Hajj Yatra 2023: ఏపీ నుంచి హజ్ యాత్రకు భారీగా తరలివెళ్తున్న ముస్లింలు.. 170 మందితో బయలుదేరిన తొలి విమానం

హజ్ యాత్రకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2300 మందికి అవకాశం ఉంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి 170 మంది ప్రయాణికులతో తొలి విమానం నేరుగా జెడ్డాకు వెళ్లనుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు.

Hajj Yatra 2023: ఏపీ నుంచి హజ్ యాత్రకు భారీగా తరలివెళ్తున్న ముస్లింలు.. 170 మందితో బయలుదేరిన తొలి విమానం

Hajj Yatra 2023

Hajj Yatra 2023: ఏపీ నుంచి హజ్ యాత్రకు ముస్లింలు భారీగా తరలివెళ్తున్నారు. వీరికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఉదయం ఏస్‌జీ 5007 విమానం బయలు దేరింది. 170 మంది ప్రయాణీకులతో నేరుగా జెడ్డాకు ఈ విమానం చేరుకుంటుంది. 41రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న హజీలు తిరిగి ఏపీకి రానున్నారు. విజయవాడలోనే ఎంబారికేషన్ పాయింట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు అధికారులు వాల్వో బస్సులు ఏర్పాటు చేశారు.

Air India: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలను నడపనున్న ఎయిర్ ఇండియా

హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,819మందిపై  దాదాపు రూ.83 వేల అదనపు భారం పడుతుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హజీలకు రూ.14.51 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బస, భోజనం, రవాణా సదుపాయాలు కల్పించడం పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Vishnuvardhan Reddy: చంద్రబాబు, అమిత్ షా భేటీపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లింది

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా 10టీవీతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచే నేరుగా హజ్‌కు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,300 మంది మక్కా యాత్రకు వెళ్తున్నారని చెప్పారు. తొలి విమానంలో 170 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. 1819 మంది గన్నవరం నుంచి అంబారికేషన్‌తో నేరుగా వెళ్తున్నారని అన్నారు. గన్నవరం నుంచి వెళ్తుండడంతో ఒక్కరిపై దాదాపు 80వేల రూపాయల భారం పడుతుందని, దీంతో పేద, మధ్య తరగతి ముస్లింలకు హజ్ యాత్ర భారంగా మారిందని అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగానే 24 గంటల్లో 14.51 కోట్ల రూపాయలు ఇచ్చారని అంజాద్ భాషా తెలిపారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వస్తుందా? కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

7వ తేదీ నుండి 14వ తేదీ వరకు విమానాలు బయలు దేరుతున్నాయని, హజ్ యాత్రకు వెళ్ళేవారికోసం అన్ని ఏర్పాట్లు చేశామని, హజ్ యాత్రికులకు లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ఏపీకి కోటా ఇస్తారని, డబ్బులు ఉన్నా హజ్ యాత్రకు వెళ్లలేరని డిప్యూటీ సీఎం తెలిపారు. మన రాష్ట్రం నుంచి 2300 మందికి హజ్ యాత్రకు వెళ్లే అదృష్టం దక్కిందని చెప్పారు. పవిత్ర మక్కాలో రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధన చేయాలని కోరుతున్నామని చెప్పారు.