Para Commando Sai Tej : ‘రావత్ గారు ఎక్కడికి వెళ్లాలన్నా మా వాడిని తీసుకెళ్లేవాడు’ : సాయితేజ తండ్రి మోహన్

బిపిన్ రావత్ తో సాయి తేజ్ కు ఎంతో అనుబంధం ఏర్పడిందని సాయితేజ్ తండ్రి మోహన్ తెలిపారు. రావత్ ఎక్కడికి వెళ్లాలన్నా తమ వాడిని తీసుకెళ్లేవారని పేర్కొన్నారు.

Para Commando Sai Tej : ‘రావత్ గారు ఎక్కడికి వెళ్లాలన్నా మా వాడిని తీసుకెళ్లేవాడు’ : సాయితేజ తండ్రి మోహన్

Saitej

Sai Tej’s father Mohan : తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి పారా కమాండో సాయితేజ మరణించిన విషయం తెలిసిందే. సాయితేజ్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిపిన్ రావత్ తో సాయి తేజ్ కు ఎంతో అనుబంధం ఏర్పడిందని సాయితేజ్ తండ్రి మోహన్ తెలిపారు. రావత్ ఎక్కడికి వెళ్లాలన్నా తమ వాడిని తీసుకెళ్లేవారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో శనివారం (డిసెంబర్11,202) 10టీవీతో మోహన్ ప్రత్యేకంగా మాట్లాడారు. సాయి తేజ్ తోనే కలిసి రావత్ భోజనం చేసేవారని గుర్తు చేశారు.

తాను రిటైర్డ్ అయ్యాక ప్రధాని మోదీ భద్రతా సిబ్బందిలో చోటు కల్పిస్తానని రావత్ చెప్పినట్లు సాయి తేజ్ తమకు చెప్పారని మోహన్ వెల్లడించారు. ఇద్దరూ ఒకేసారి మరణించడం తట్టుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. ఒక దశలో తాను ఆర్మీ ఉద్యోగం వదిలి వేయమని చెప్పినా… దేశం కోసం చనిపోతాను తప్ప ఉద్యోగం వదలను అని సాయితేజ్ అనేవాడని తెలిపారు. రిటైర్డ్ అయ్యాక మిలట్రీ స్కూల్ పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని భావించారని పేర్కొన్నారు.

TTD : ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆనందసాయి సహకారం

కుటుంబీకుల విజ్ఞప్తి మేరకే సాయి తేజ్ మృతదేహాన్ని రేపు తీసుకు వస్తున్నారని సాయి తేజ్ బాబాయ్ సుదర్శన్ తెలిపారు. సాయంత్రం మృతదేహం వస్తే అంతిమ కార్యక్రమాల నిర్వహణ, సందర్శకుల రద్దీ కట్టడి చేయడం కష్టమవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రేపు తెల్లవారు జామునే సాయి తేజ భౌతికకాయం కర్ణాటక – ఏపీ సరిహద్దుకు చేరుకుంటుందని చెప్పారు.

అక్కడి నుంచి ర్యాలీగా భౌతికకాయాన్ని గ్రామానికి తీసుకు రావాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఇంటి పరిసరాల్లోని తాత, ముత్తాతల సమాధుల వద్ద సాయి తేజ భౌతికకాయాన్ని ఖననం చేస్తామని పేర్కొన్నారు. సాయి తేజ్ సమాధి వద్ద ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Covid-19 Face Mask: కొవిడ్ కణాలు తాకగానే మెరిసిపోయే మాస్క్.. సైంటిస్టులు సక్సెస్

సాయితేజ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్ బేస్‌కు తీసుకెళ్లారు. శనివారం రాత్రికి ఆర్మీ బేస్ ఆసుపత్రిలోనే సాయితేజ మృతదేహాన్ని ఉంచనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు సాయి తేజ్ మృతదేహాన్ని స్వగ్రామం ఎగువరేగడికి చేరుకుటుంది.

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్‌ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. ఆయన స్వస్థలం ఎగువ రేగడ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

PM vs Akhilesh : స‌ర‌యూ కెనాల్ ప్రాజెక్టుపై మోదీ-అఖిలేష్ విమర్శల బాణాలు

సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామలతో సాయితేజ్​కు 2015లో వివాహం అయింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ(4), కూతురు దర్శిని(2) ఉన్నారు. వీరి కుటుంబం మదనపల్లె ఎస్​బీఐ కాలనీలో ఏడాది కాలంగా నివాసం ఉంటోంది. 2013లో సాయితేజ్ ఆర్మీలో జవానుగా చేరారు. ఏడాది తర్వాత పారా కమెండో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. స్పెషల్ ఫోర్సెస్​ 11 పారా విభాగంలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.

బెంగళూరులో సైనికులకు శిక్షకుడిగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, సాయితేజ్ తమ్ముడు కూడా ఆర్మీలోనే సేవలందిస్తున్నారు. సాయితేజ్ మహేష్ బాబు సిక్కింలో ఆర్మీ విధులు నిర్వహిస్తున్నారు.