Nandi idol growing : ఆ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందంట..

కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న (నంది) రోజురోజుకు పెరుగుతుంది అన్నది అందరూ నమ్ముతున్న, చెబుతున్న విషయం.

Nandi idol growing : ఆ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందంట..

Nandi Idol Growing

Nandi idol is growing : ప్రతి ఆలయానికి ఒక్కో చరిత్ర , పలు ఆసక్తికర విశేషాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఆలయం మాత్రం ఎన్నో ఆసక్తికర విషయాలను, అంతుచిక్కని వింతలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన భవిష్య వాణి లోని పలు ప్రముఖ అంశాలు అందరికీ తెలిసే ఉంటాయి. అందులో ఒకటి…కలియుగాంతంలో కర్నూలు జిల్లాలోని యాగంటిలో ఉండే బసవయ్య లేచి రంకెలేస్తాడు.. అన్న విషయం. ఇప్పుడు ఈ ఆలయం గురించిన పూర్తి చరిత్రను తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని యాగంటి బసవన్న (నంది) రోజురోజుకు పెరుగుతుంది అన్నది అందరూ నమ్ముతున్న, చెబుతున్న విషయం.

20 సంవత్సరాలకు ఒకసారి కేవలం ఒక అంగుళం మాత్రమే ఈ నంది విగ్రహం పెరుగుతుందట. ఒకప్పుడు ఈ ఆలయంలోని బసవన్న విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసే అంత స్థలం ఉండేదట.. కానీ ఈ విగ్రహం రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రస్తుతం ఇప్పుడు విగ్రహం పెరిగి పెరిగి దాదాపు స్తంభాలకు దగ్గరగా వచ్చేసింది. ఈ నందిని చూసిన ఎవరికైనా జీవంతో ఉన్న బసవన్న చూసిన అనుభూతి కలుగుతుంది. అంతటి జీవకళ ఈ శిల్పంలో ఉంది. దానికి తోడు విగ్రహం పెరుగుతుండటం విశేషం. అయితే ఈ విగ్రహం పెరుగుతుండడానికి శాస్త్రీయ కారణం కూడా ఉందంటూ తెలుపుతున్నారు పలు శాస్త్రజ్ఞులు. ఇంతకీ అదేంటంటే రొమేనియాలోని కొన్ని రకాల రాళ్లు ప్రాణమున్న జీవులు రోజురోజుకు పెరుగుతుంటాయట.

అలా పెరుగుతూ ఒక పరిమాణం వచ్చాక తల్లి రాయి నుండి విడిపోయి మళ్లీ పెరగడం మొదలుపెడతాయి. అలాగే యాగంటి లోని బసవన్న విగ్రహం కూడా అలాంటి రాళ్లతో చేయబడిందని, అందుకే ఆ విగ్రహం అలా రోజురోజుకూ పెరుగుతోందని తెలుపుతున్నారు కొందరు శాస్త్రజ్ఞులు. ఇవి ప్రాణం ఉన్న జీవులు కానప్పటికీ…రసాయనిక క్రియ వలన ఇలా పెరుగుతుందట. ఈ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం కురవగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడి… పెరుగుతుంటాయి. అదేవిధంగా యాగంటిలో బసవన్న విగ్రహం కూడా శాస్త్రీయ కారణంగానే పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. అయితే ఇదే విధంగా మిగిలిన నంది విగ్రహాలు కూడా ఎందుకు పెరగడం లేదు అన్న ప్రశ్నకు ఇప్పటికీ అంతు పట్టడం లేదు.

అంతేకాదు ఈ ఆలయం చుట్టు పక్కల ఒక కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అప్పట్లో శనీశ్వరుడు తాను ఈ క్షేత్రంలో అడుగుపెట్టనని శబ్దం చేయడం వల్లనే… ఆయన వాహనం కాకి కూడా ఈ ఆలయం సమీపంలో వాలదని ప్రతీతి. ఇక ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే…ఆలయంలో ఉండే కోనేరులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందో… అలాగే ఆకుల నుండి బయటకు వచ్చిన నీరు ఎలా మాయం అవుతుందో నేటికి అంతు చిక్కకుండా ఉంది. ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ దేవాలయంలో ఉన్నాయి.