AP లోని ఆ జిల్లాలో Lockdown..01 గంట తర్వాత..అందరూ ఇంట్లోనే ఉండాలి

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 09:58 AM IST
AP లోని ఆ జిల్లాలో Lockdown..01 గంట తర్వాత..అందరూ ఇంట్లోనే ఉండాలి

ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయి. మొత్తం ఈ జిల్లాలో 22 మంది మరణించారు.

దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలో వైరస్ విస్తరించకుండా ఉండేందుకు లాక్ డౌన్ అమలు చేయలని అధికారులు డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగా 2020, జులై 24వ తేదీ శుక్రవారం నుంచి నిబంధనలు అమలు చేస్తున్నారు. వారం రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు.
జులై 24వ తేదీ నుంచి జులై 31వ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఉదయం 7 నుంచి 01 గంట వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని ఆదేశించారు.

01 గంట తర్వాత ఎవరినీ అనుమతించమని, రోడ్లకు మీదకు ప్రజలు రావొద్దని ఇళ్లకే పరిమితం కావాలని ఆంక్షలు విధించారు. వ్యాపారులు స్వచ్చదంగా లాక్ డౌన్ పాటించాలని కలెక్టర్ తెలిపారు. మెడికల్ షాపులు, పాల షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో లాక్ డౌన్ అమలు జరుగుతోంది.

ఏపీలో 23వ తేదీ గురువారం కొత్తగా 7,998 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72 వేల 711కి చేరింది. గడిచిన 24 గంటల్లో 58 వేల 052 శాంపిల్స్‌ను పరీక్షించారు. 7 వేల 998 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. కొత్తగా కరోనాతో 61 మంది మృతి చెందారు.

మొత్తం మరణాల సంఖ్య 884గా నమోదైంది. కరోనా నుంచి 5 వేల 428 మంది కొలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37,555కి చేరింది. 34 వేల 272 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.