ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ

ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్…అత్యధిక స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ

Panchayat election counting in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాలను బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. పోలింగ్‌ జరిగిన మేజారిటీ ప్రాంతాల్లో మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ఏపీలోని 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని 3వేల 221 పంచాయతీలు, 19వేల 607 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.71 శాతం పోలింగ్ నమోదైంది.

మొదటి, రెండో విడతలతో పొలిస్తే పోలింగ్‌ శాతంలో మార్పు కనిపించలేదు.. అయితే పోలింగ్‌ జరిగేలా ఘటనలు ఎక్కడా జరగలేదని అధికారులు తెలిపారు.. అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు..