CM Candidate Pawan Kalyan : సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..? టీడీపీకి చెక్ పెట్టేలా బీజేపీ స్కెచ్..?

పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్ లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? (CM Candidate Pawan Kalyan)

CM Candidate Pawan Kalyan : సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..? టీడీపీకి చెక్ పెట్టేలా బీజేపీ స్కెచ్..?

Cm Candidate Pawan Kalyan

CM Candidate Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా కమలదళం యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందా? మరికొద్ది రోజుల్లో ఏపీ టూర్ లో జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్నారు? పవన్ నే.. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? దీనిపై బీజేపీ, జనసేనలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇదే నిజమైతే ఏ పార్టీకి మేలు జరగబోతోంది?

ఆరు నూరైనా, నూరు 150 అయినా.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూస్తాను అని పవన్ చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో ఇంకా రగులుతూనే ఉంది. ఈ ప్రకటన తర్వాత ఏపీలో పొత్తులపై అందరికీ ఆసక్తి పెరిగింది. సర్కార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే.. పవన్ టీడీపీతో కలిసి వెళితేనే అది సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు బీజేపీ. జనసేనాని తెలుగుదేశం వైపు వెళ్లకుండా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.(CM Candidate Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి : పవన్ కళ్యాణ్

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు రావాలంటే జనసేనతో పొత్తు ఉండాల్సిందే. రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిందే. ఇది జరగాలంటే పవన్ ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిందే. అంతకుమించి బీజేపీకి వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా టీడీపీ, జనసేన ఒకటైతే ఏపీలో బీజేపీ జీరో అవుతుందనే టాక్ ఉంది. అలాగని బీజేపీ, టీడీపీ కలిసే ప్రసక్తే లేదు. ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితీ లేదు. అందువల్ల ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయన్నదే మోస్ట్ ఇంట్రస్టింగ్ పార్ట్.

ఏపీ నాయకులతో ఎలా ఉన్నా.. బీజేపీ అధిష్టానంతో మాత్రం పవన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. జూన్ 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లోనే పవన్ ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించి తమతోనే ఉండేలా లాక్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీకి చెక్ పెట్టడంతో పాటు పవన్ కున్న కరిష్మాను గట్టిగా వాడేసుకునేలా ప్లాన్ చేసింది కమలదళం. దీనికి అనుగుణంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు.

Pawan Kalyan (1)

Pawan Kalyan (1)

Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 

మరి బీజేపీ ఆఫర్ కు పవన్ ఓకే చెప్పి రెండు పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తే ఏపీలో మళ్లీ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. అప్పుడు పవన్ చీల్చొద్దు అనుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆటోమేటిక్ గా అటొకటి ఇటొకటి చీలి మళ్లీ వైసీపీకే మేలు జరుగుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో బీజేపీ-జనసేనకు కొన్ని సీట్లు, ఓట్లు తప్ప.. అధికారం మాత్రం కష్టమే అని చెప్పుకుంటున్నారు.

Pawan Chandrababu

Pawan Chandrababu

ఇలా కాకుండా టీడీపీ-జనసేన ఒక్కటైతే.. బీజేపీ ఆటలో అరటిపండుగా మారిపోయి పూర్తిగా పక్కకెళ్లిపోయి పోటీ రెండు వైపులకే పరిమితం అవుతుంది. అప్పుడు వైసీపీకి భారీగా సీట్లు తగ్గిపోతాయనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ, ప్రచారం జరుగుతున్నట్లుగా జేపీ నడ్డా.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారిపోతాయన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏది ఏమైనా బీజేపీ జనసేన పొత్తులో బీజేపీ నాయకుడే సీఎం అభ్యర్థిగా ఉంటారని కమలదళం నాయకులు చెబుతుంటే, పవన్ కళ్యాణే సీఎం క్యాండిడేట్ అని జనసైనికులు అంటున్నారు.

Somu Veerraju On BJP-TDP Alliance : టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు