Pawan Kalyan: ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులపై పడుతుందా?: పవన్

బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుంచి ఖర్చు ఎవరు చెల్లిస్తారు?

Pawan Kalyan: ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులపై పడుతుందా?: పవన్

Pawan Kalyan

Updated On : July 23, 2023 / 4:58 PM IST

Pawan Kalyan – BYJUS: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం-బైజూస్ మధ్య జరిగిన ఒప్పందంపై జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై ఆయన నిలదీశారు.

పవన్ ట్వీట్లోని అంశాలు..

1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు రూ.580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ రూ.18,000 నుంచి రూ.20,000 ఉంటుంది.

2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.

3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం రూ.580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా?

ప్రశ్నించదగిన అంశాలు..

1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుంచి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది.

8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదు.

2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = రూ.750 కోట్లు)

3. 8వ తరగతి నుంచి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు?

4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా?

జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారు.

పవన్ ట్వీట్..

Pawan Kalyan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ మూడు ప్రశ్నలు