Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు.. మళ్లీ అదే తప్పు చేశారు!

Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదని ఏపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదు.. మళ్లీ అదే తప్పు చేశారు!

Payyavula Keshav on Governor Speech: గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల అంశం ఎందుకు లేదని ఏపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేకపోయిందని నిలదీశారు. పాత గవర్నర్ ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం అలాంటి తప్పే ఇవాళ మళ్లీ చేసిందని విమర్శించారు. తొలిసారి ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగిస్తున్నంతసేపు టీడీపీ సభ్యులు శాసనసభలో నినాదాలు చేశారు.

గవర్నర్ తోనూ అసత్యాలు చెప్పించారు
గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీ వెలుపల పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. “గవర్నర్ తో ముఖ్యమంత్రిని పొగిడించటమేంటి? రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా? ప్రథమ పౌరుడితో సీఎంని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారు. గవర్నర్ ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారు. ఇది సభా నిభంధనలకు విరుద్ధం. శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రసంగంలో లేదు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పించే యత్నం చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్ తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించింద”ని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.


అసత్యాలు చడవలేక ఇబ్బంది పడ్డ గవర్నర్: నిమ్మల 

విభజన చట్టం 10 ఏళ్ల కాలపరిమితి ముగుస్తున్నా.. గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావన లేదని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఈ ఎన్నికల కాలానికి పోలవరం పూర్తికాదనే అసమర్ధతను ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చాటుకుందని, అసత్యాలు చదవలేక అనేకసార్లు గవర్నర్ కూడా ఇబ్బంది పడ్డారని అన్నారు.

Also Read: కాపులే కాదు నా అభిమానులూ నాకు ఓటేయలేదు, అండగా ఉంటే పైకి తీసుకొస్తా.. పవన్ కల్యాణ్


గవర్నర్ బాధపడే ఉంటారు: గోరంట్ల

గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రంగుల పిచ్చ, పేర్ల పిచ్చ తప్ప మరేం లేదని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యనించారు. తన చేత ఇన్ని అసత్యాలు పలికించినందుకు గవర్నర్ కూడా ఇంటికి వెళ్లి బాధపడి ఉంటారని అన్నారు. వివిధ పథకాలకు సంబంధించి గవర్నర్ తో ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ అంకెల గారడీగా పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం సాగిందని.. పోలవరం, అమరావతి అంశాల ప్రస్తావనే లేదని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ విమర్శించారు.


16న సభలో బడ్జెట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9 రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 19 ఆదివారం, 22న ఉగాది సెలవు. ఈ నెల 24తో సమావేశాలు ముగుస్తాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో అధికార, విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.

Also Read: పవన్ కల్యాణ్ కోసం నోవాటెల్ వద్దకు భారీగా అభిమానులు..