Kuna Ravi Kumar: నా వ్యాఖ్యలపై పీకే టీం దుష్ప్రచారం చేస్తోంది.. నా మాటలు వక్రీకరించారు: టీడీపీ నేత కూన రవి కుమార్

జగన్ సలహాదారులు, పీకే టీం కలిసి నేను మాట్లాడిన మాటల్లోని పదాలను కట్ చేసి, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటితో జిల్లాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని జిల్లాల్లో వైసీపీకి చెందిన యాదవ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు.

Kuna Ravi Kumar: నా వ్యాఖ్యలపై పీకే టీం దుష్ప్రచారం చేస్తోంది.. నా మాటలు వక్రీకరించారు: టీడీపీ నేత కూన రవి కుమార్

Kuna Ravi Kumar: గొర్రెల కాపరుల విషయంలో తన మాటలను వక్రీకరించారని, తన విషయంలో పీకే (ప్రశాంత్ కిషోర్) టీం దుష్ప్రచారం చేస్తోందన్నారు టీడీపీ నేత కూన రవి కుమార్. ఇటీవల గొర్రెల కాపరుల విషయంలో కూన రవి కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మంగళవారం ఆయన వివరణ ఇచ్చారు.

Srinivas Goud: లక్షల కోట్లు దోచుకున్న వారిని వదిలేసి ఆడబిడ్డను వేధిస్తున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

‘‘విశాఖపట్నంలో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తే.. ఆ మాటలను కొందరు వక్రీకరించారు. ఉత్తరాంధ్రను రాజధాని చేయకపోతే, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని ధర్మాన వంటి మంత్రులు అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులు ఇలా మాట్లాడొచ్చా? మూడు రాజధానులపై చట్టం లేదు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రాజధానుల పేరుతో మభ్యపెట్టారు. ఈ విషయంలో గొర్రెల కాపరికి ఉన్న జ్ఞానం కూడా లేకుండా హీనంగా మాట్లాడుతున్నారు అన్నాను. అంతే కానీ, ఏ కులాన్నీ కించపరచలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచన నాకు లేదు… రాదు. జగన్ సలహాదారులు, పీకే టీం కలిసి నేను మాట్లాడిన మాటల్లోని పదాలను కట్ చేసి, వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

Chinkara: జింక మాంసం వండుకుతిన్న వేటగాళ్లు.. బిష్ణోయ్ వర్గం ఆగ్రహం

వాటితో జిల్లాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. నన్ను అరెస్టు చేయాలని జిల్లాల్లో వైసీపీకి చెందిన యాదవ నేతలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు. అఖిల భారత యాదవ సంఘం సైతం నేను మాట్లాడిన మాటల్లో తప్పేం లేదన్నారు. గొర్రెల కాపరి అంటే అది ఒక సామాజిక వర్గానికి చెందినది కాదు. ప్రతి వ్యవసాయదారుడు గొర్రెలు, కోళ్ల పెంపకం చేస్తుంటారు. పీకే టీం కావాలనే నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. నేను వాడిన పదాలు ఎవరి మనోభావాల్ని దెబ్బతీసినా, ఏ కులం వారైనా బాధపడినా క్షమించమని కోరుతున్నా’’ అంటూ కూన రవి కుమార్ వ్యాఖ్యానించారు.