Polavaram Issue: పోలవరం ప్రాజెక్టులో “మేఘ వర్సెస్ జేపీ”: ఇసుక తరలింపుపై దుమారం

గోదావరిలో ఇసుక తరలింపుపై పోలవరం కాంట్రాక్టు సంస్థ మేఘ ఇంజనీరింగ్ మరియు జేపీ వెంచర్స్ సంస్థ మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది.

Polavaram Issue: పోలవరం ప్రాజెక్టులో “మేఘ వర్సెస్ జేపీ”: ఇసుక తరలింపుపై దుమారం

Polavaram

Polavaram Issue: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో పోలవరంలో చేపట్టిన పనుల గురించి, ప్రాజెక్టు పురోగతిలో నెలకొన్న అవరోధాల గురించి, ప్రాజెక్ట్ ఎత్తుపై తగ్గింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2023 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇదిలాఉంటే.. తాజాగా పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారులమధ్య సఖ్యత కొరవడింది.

Also read:Telugu States: ఎర్ర బంగారం.. అన్నదాతకు సిరులు కురిపిస్తున్న మిర్చి!

గోదావరిలో ఇసుక తరలింపుపై పోలవరం కాంట్రాక్టు సంస్థ మేఘ ఇంజనీరింగ్ మరియు జేపీ వెంచర్స్ సంస్థ మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక తరలింపు కాంట్రక్టును ప్రభుత్వం జేపీ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పోలవరం సమీపంలో గోదావరి నది నుంచి మేఘ సంస్థ ఇసుక తరలిస్తుండగా జేపీ సంస్థ సిబ్బంది అడ్డుకున్నారు. ఇసుక కాంట్రాక్టు తమకే ఉన్నందున, మేఘ సంస్థ ఇసుక తరలించడానికి వీల్లేదంటూ జేపీ సంస్థ సిబ్బంది మేఘ సంస్థ వాహనాలను అడ్డుకున్నారు. ఇసుకలేని కారణంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్‌ పనులు నిలిచిపోయాయి.

Also Read:Botsa On Three Capitals : తగ్గేదేలే.. 3 రాజ‌ధానులపై స‌భ‌లో బిల్లు- బొత్స సత్యనారాయణ

అయితే, పోలవరం ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుకను వాడుకునేందుకు తమకు అనుమతులు ఉన్నాయని మేఘ సంస్థ ప్రతినిధులు తెలుపగా, అనుమతులు ఉన్నా, గోదావరిలోని ఇసుక రీచ్‌లన్నీ తమవేనని, ఇక్కడి నుంచి ఇసుక తరలించడానికి వీల్లేదంటూ జేపీ సంస్థ సిబ్బంది వాదించారు. దీంతో మంగళవారం నాడు సుమారు 250 ఇసుక టిప్పర్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. పోలవరం ప్రోఎజెక్టుకు ఇసుక సరఫరా నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన పీపీఏ అధికారులు జేపీ సంస్థ సిబ్బందికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ సమస్య సీఎం కార్యాలయం దాకా వెళితేగాని కొలిక్కిరాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Also read:Indian Roads: డిసెంబర్ 2024 నాటికి భారత్ లో రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయి: నితిన్ గడ్కరీ