గోదావరికి వరదలొచ్చిన ఆగని పోలవరం పనులు

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 02:29 PM IST
గోదావరికి వరదలొచ్చిన ఆగని పోలవరం పనులు

Polavaram project progress report : వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. కేవలం శంకుస్థాపనల వరకే పరిమితమైంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పోలవరం పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు వైసీపీ సర్కార్.. 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే.. పోలవరం పనులు ఎక్కడా ఆగడం లేదు.



కరోనా కేసులు పెరుగుతున్నా.. భారీ వర్షాలతో గోదావరిలో వరదలు వచ్చినా.. పోలవరం నిర్మాణ పనులు మాత్రం ఎక్కడా ఆగలేదు. శరవేగంగా మందుకు కదులుతున్నాయి.
Polavaram project

పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన 52 పిల్లర్లు వందశాతం పూర్తయ్యాయి. గోదావరికి వరదలొస్తే పనులు నిలిచిపోకుండా.. అధికారులు ముందుగానే ప్లాన్ చేశారు.
దీంతో.. పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో.. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, పిల్లర్లపై రోడ్డు నిర్మాణ పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టులోని 52 పిల్లర్ల నిర్మాణం పూర్తి అయింది. 52వ పిల్లర్ నుంచి 36వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మిస్తున్నారు.Polavaram project ఇప్పటికే.. 260 మీటర్ల పొడవునా బ్రిడ్జిపై కాంక్రీట్‌తో రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరో 125 మీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి పనులు పూర్తి చేశారు. 160 అడుగుల ఎత్తులో బ్రిడ్జిపై చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 21వ పిల్లర్ నుంచి 26వ పిల్లర్ వరకు భారీ గడ్డర్లు ఏర్పాటు చేస్తూ.. పనుల్లో వేగం పెంచారు.



స్పిల్ వేకు ఎగువన, దిగువన.. గోదావరి వరద నీరు నిలిచి ఉన్నా.. పనులు కొనసాగిస్తూనే ఉంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన కుడి కాలువ రెగ్యులేటర్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. రెగ్యులేటర్ నిర్మాణం పూర్తి చేసి గేట్లు కూడా బిగించేశారు.
https://10tv.in/central-government-key-comments-on-polavaram-project/
Polavaram Project Speed up, Works by early 2021 ప్రాజెక్ట్ స్పిల్ వే నుంచి.. రివర్స్‌లో రెగ్యులేటర్ ద్వారా ట్విన్ టన్నెల్స్ నుంచి కుడి కాలువకు నీళ్లు వెళ్లనున్నాయి. ఇప్పటికే.. రెగ్యులేటర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కుడి కాలువ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తయిపోయాయి.