Red Sandal seized : ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ వద్ద అంత రాష్ట్ర సరిహద్దు లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

Red Sandal seized : ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Ns Red Sandal Seized

Updated On : December 8, 2021 / 6:37 AM IST

Red Sandal seized : ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ వద్ద అంత రాష్ట్ర సరిహద్దు లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా రెండు మినీ బోలెరో ట్రక్స్ లో తరలిస్తున్న దుంగలను  చెక్ పోస్టు సిబ్బంది పట్టుకున్నారు.
Also Read : Sand Mafia : ఇసుక మాఫియా అరాచకం-వీఆర్ఏ పై దాడి-మృతి
హైదరాబాద్ నుండి చీరాలకు చేపల మేతతో వెళుతున్న ఈ ట్రక్కులలో చేపల మేత కింద అమర్చిన ఎర్రచందనం దుంగలను చెక్ పోస్టు సిబ్బంది గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని తెలిపారు.ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని  వాటిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసారు.  రెండు వాహనాలను సీజ్ చేశారు. అడిషనల్ ఎస్పీ రీస్వంత్ రెడ్డి పట్టుబడిన దుంగలను పరిశీలించారు. కేసు తదుపరి విచార నిమిత్తం విజయపురి సౌత్ పోలీసు స్టేషన్ కు బదలాయించారు.