పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల విడుదల | Release of funds for Polavaram project

ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల విడుదల : కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలలో జాప్యం లేదని కేంద్రం తెలిపింది. ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా నిధుల విడుదల జరుగుతుందని స్పష్టం చేసింది.

ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల విడుదల : కేంద్రం

Release of funds for Polavaram project : పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలలో జాప్యం లేదని కేంద్రం తెలిపింది. ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా నిధుల విడుదల జరుగుతుందని స్పష్టం చేసింది. వైసీసీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరంపై ఖర్చు చేసిన బిల్లలును పరిశీలించి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. బడ్జెట్‌యేతర నిధులను నాబార్డ్ ద్వారా సమకూర్చుతున్నామన్నారు.

ఎంత మొత్తంలో నిధులు కావాలన్నది జలశక్తి శాఖ చెబితే…నాబార్డ్ మార్కెట్ నుంచి సమీకరిస్తుందని కటారియా తెలిపారు. మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందన్నారు. సమీకరించిన నిధులు నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి… అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు అధారిటీకి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి విడుదలవుతాయన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా అనవసరపు జాప్యం లేదని, జాప్యం కారణంగా ఖర్చు పెరిగిందీ లేదని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 2014 నుంచి 2021 జనవరి వరకూ 12వేల392 కోట్లు ఖర్చయ్యాయని, ఇప్పటి వరకు కేంద్రం 10కోట్ల 848లక్షలు వి డుదల చేసిందని తెలిపారు. మిగిలిన రూ. 1,569 కోట్లను విడుదల చేయాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అధారిటీని కేంద్రం ఆదేశించిందని రతన్‌లాల్ కటారియా తెలిపారు.

×