బాబోయ్.. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల.. జస్ట్‌లో బతికిపోయాడు..

ఈ హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండే డ్రింక్ తాగి కాస్త సేదతీరుతున్నారు జనాలు. ఈసారి ఎండలో తిరిగొచ్చాక చల్లదనం కోసం మీరూ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

బాబోయ్.. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల.. జస్ట్‌లో బతికిపోయాడు..

Cool Drink Snake

snake found in cool drink bottle in amalapuram : ఎండా కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండతీవ్రతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాహంతో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో చల్లగా ఏదైనా తాగితే బాగుండనిపిస్తుంది. అలాంటి వారిలో ఎక్కువమంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. థమ్సప్, పెప్సీ, లిమ్‌కా, సెవెనప్, మాజా.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. కూల్ గా ఉండే డ్రింక్ తాగి కాస్త సేదతీరుతున్నారు జనాలు. ఈసారి ఎండలో తిరిగొచ్చాక చల్లదనం కోసం మీరూ ఏదో ఒక కూల్ డ్రింక్ తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. కూల్ డ్రింక్ తాగేముందు బాటిల్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

అసలేం జరిగిందంటే.. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల వచ్చింది. ఏంటి ఫ్యూజులు ఎగిరాయా? అవును. ఇది నిజం. కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల కనిపించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని పేరూరు వై జంక్షన్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బేకరీలో ఓ వ్యక్తి కూల్ డ్రింక్ సీసా కొన్నాడు. తీరా దాన్ని తాగుదామని చేతికి తీసుకున్నాడు. కాసేపట్లో మూత తీసి తాగేసేవాడే. కానీ అతడికి ఎందుకో డౌట్ వచ్చింది. కూల్ డ్రింక్ సీసాలో ఏదో ఉన్నట్టు కనిపించింది. అంతే, దాని మూత తియ్యలేదు. సీసాని పైకి కిందికి తిప్పి చూశాడు. అందులో పాము పిల్ల కనిపించడంతో బిత్తరపోయాడు. అతడి ఒళ్లంతా జలదరించింది. వామ్మో అని గుండె పట్టుకున్నాడు. కాగా, కూల్ డ్రింక్ బాటిల్‌లో ఉన్న ఆ పాము అప్పటికే చనిపోయి ఉంది.

కూల్ డ్రింక్ సీసాలో పాము పిల్ల ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై షాపు యజమాని స్పందించాడు. ‘కూల్‌ డ్రింక్‌ సీసాలో 3 అంగుళాల పాము కనిపించింది. మూడు రోజుల కిందటే కూల్‌ డ్రింక్‌ ఏజెన్సీ ఈ బాటిళ్లను సప్లయ్ చేసింది. సీసాలో పామును గమనించగానే సప్లయర్స్‌కి ఫిర్యాదు చేసి, స్టాక్‌ తిరిగి పంపించాం’ అని అతడు వివరించాడు.

అయితే, కూల్ డ్రింక్ కొన్న వ్యక్తి అదృష్టం బాగుందనే చెప్పాలి. అతడికి ఇంకా నూకలు మిగిలే ఉన్నాయి. కూల్ డ్రింక్ తాగే ముందు సీసాను గమనించడంతో సరిపోయింది. లేదంటే.. అతడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడేది. ఈ ఘటనతో కూల్ డ్రింక్ కొన్న వ్యక్తి బిత్తరపోయాడు. ఒకవేళ చూసుకోకుండా తాగుంటే తన పని మటాష్ అయ్యేదని వాపోయాడు. పైగా అది తాచు పాము పిల్లట. గబా గబా ఆ బాటిల్ నోట్లో పెట్టుకొని తాగి ఉంటే..? అమ్మో తలుచుకుంటేనే వణుకు పుడుతోంది కదూ.

అయితే ఇక్కడ ఓ ధర్మ సందేహం తలెత్తుంది. అదేంటంటే.. అసలు పాము పిల్ల సీసాలోకి ఎలా దూరింది? ఎలాంటి పరిస్థితుల్లో వీటిని తయారు చేస్తున్నారు? ఎక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు? కల్తీ చేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడి నీళ్లు తీసుకొచ్చి కలుపుతున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.

కూల్ డ్రింక్‌ బాటిళ్లలో చిన్న చిన్న పురుగులు, బల్లులు, పేపర్లు, కవర్లు వచ్చిన ఘటనల గురించి గతంలో విన్నాం. రసాయనాలు కలిపారన్న వార్తలూ చదివాం. కానీ, పాము రావడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సో, ఇక ముందు కూల్ డ్రింక్ సీసా లేదా బాటిల్ కొనుక్కున్నాక గబగబా తాగేయడం మంచిది కాదు. ఆ బాటిళ్లను కిందా మీద జాగ్రత్తగా చూసుకోండి. ఒకటికి పదిసార్లు సీసా లేదా బాటిల్ ని బాగా పరిశీలించడం ఉత్తమం. అసలీ గొడవంతా ఎందుకులే అనుకుంటే.. మన పెద్దోళ్లు చెప్పినట్లు.. ఎండలో అలసిపోతే చల్లటి మజ్జిగ తాగండి. లేకపోతే కొబ్బరి బొండం తాగండి. అదీ మజా ఇవ్వకపోతే.. చల్లని కుండలోని నీళ్లతో నిమ్మరసం చేసుకుని తాగండి. అప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. పైగా ఆరోగ్యానికి మంచిది కూడా.