Amaravati : తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. ఉరేసుకోబోయిన మహిళ రైతును అడ్డుకున్న పోలీసులు

జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.

Amaravati : తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. ఉరేసుకోబోయిన మహిళ రైతును అడ్డుకున్న పోలీసులు

Amaravati

Tullur Deeksha Camp :  అమరావతి రాజధాని తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీక్షా శిబిరం నుండి బయటికి రానీయకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులను బయటికి రానీయకుండా పోలీసులు బలవంతంగా అడ్డుకుంటున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో ఒక మహిళ రైతు రోప్ తాడుతో ఉరి వేసుకోబోయారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్రకు బయలుదేరిన జడ శ్రావణ్ కుమార్ ని హౌస్ అరెస్ట్ చేయడాన్ని దళిత జేఏసీ నాయకులు ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర చేసి తీరుతామని దళిత జేఏసీ నాయకులు అంటున్నారు. దళిత జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించడానికి సిద్ధం కావడాన్ని దళిత జేఏసీ నాయకులు ఖండించారు.

Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌పై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ .. రైతుల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

తాము చేస్తున్న పాదయాత్రలో వైసీపీ పార్టీ నాయకులు పాల్గొనాలని కోరారు. అందరం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రలో జై భీమ్ భారత్ పార్టీ నాయకులు, రాజధాని దళిత బహుజన పార్టీ నాయకులు చిలకా పసవయ్య, దళిత జేఏసీ నాయకులు జొన్నకూటి ఏడుకొండలు, మేరుగా నాగేశ్వరరావు, కమల పాల్గొన్నారు.

తుళ్లూరు దీక్షా శిబిరంలో ఉన్న రైతులకు అంబేద్కర్ స్మృతి వనంకి వెళ్లడానికి డీఎస్పీ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. అంబేద్కర్ కు వినతి పత్రం అందజేయడానికి తుళ్లూరు దీక్ష శిబిరం నుంచి బయలుదేరడానికి రాజధాని దళిత బహుజన పార్టీ నాయకులు, దళిత జేఏసీ నాయకులు సిద్ధమయ్యారు.