Bapatla : వేటపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.

Bapatla : వేటపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

Vetapalem Tension

Vetapalem Tension : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత కోనసాగుతోంది. మత్స్యకారుల మద్య ఆదిపత్యపోరు నెలకొన్న వేటపాలెం మండలం రామాపురం, కటారివారిపాలెం గ్రామాలలో పోలీసు బలగాలతోపాటు స్పెషల్ ఫోర్స్ ను బాపట్ల ఎస్పీ ముకుల్ జిందాల్ రంగంలోకి దింపారు. గతంలో రామాపురంలో ఓ వ్యక్తి కుద్రపూజలు చేస్తున్నాడనే నెపంతో మత్స్యకార పెద్దలు దేహశుద్ధి చేసి గ్రామం నుండి బహిష్కరించారు.

క్షుద్రపూజల్లో అనుభవం ఉన్న రామాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా కటారిపాలెంకు చెందిన కాపు పెద్దలే తమపై క్షుద్రపూజలు చేయిస్తున్నారని రామాపురం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రామాపురం నుండి గ్రామ బహిష్కరణ చేయడంతో గ్రామానికి చెందిన 85కుటుంబాలు కటారివారిపాలెం తీర ప్రాంతానికి చేరుకుని అక్కడే డేరాలు వేసుకుని నివాసముంటున్నారు.

Annamayya District : బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు

గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు. చర్చలు జరుగుతుండగా బహిష్కరణకు గురైనవారిని గ్రామంలో చేర్చుకుందామని ఒకరు మాట్లాడుతుండగా, కులకట్టుబాట్లు తప్పారు కనుక వద్దని మరొకరు మాట్లాడారు. పంతానికి పోయి మాటామాటా పెరగడంతో రామపూరం గ్రామానికి చెందిన ఇరువర్గాలు వివాదానికి దిగారు.

నిన్న(ఆదివారం) రాత్రి రామాపురం గ్రామంలోని ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది.
దీంతో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ముదస్తు చర్యల్లో భాగంగా బాపట్ల ఎస్పీ రామాపురం, కటారీపాలెం గ్రామాల్లో స్పెషల్ ఫోర్స్ ను దింపారు. నిన్న(ఆదివారం) రాత్రి చోటు చేసుకున్న వివాదంతో పోలీసులు కటారివారిపాలెం, రామాపురం మధ్య పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.