AP Employees Strike : ఏపీలో పీఆర్సీ వార్‌.. ఉద్యోగుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు

ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. మంత్రుల కామెంట్స్ ను ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు.

AP Employees Strike : ఏపీలో పీఆర్సీ వార్‌.. ఉద్యోగుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు

Strike Support

full support to AP employees strike : ఏపీలో పీఆర్సీ వార్‌ మరింత ముదిరింది.. ఉద్యోగుల సమ్మె మొదలుకాక ముందే హీట్‌ పెరుగుతోంది. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్యారోగ్యశాఖ ఉద్యోగులతో పాటు అత్యవసర సేవల విభాగాలు సమ్మెలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. మరోవైపు ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నామని.. ఇక మీదట ఎదురుచూపులు ఉండబోవని మంత్రుల కమిటీ ప్రకటించింది. ఒకవేళ ఉద్యోగ సంఘాలే తమను పిలిస్తే చర్చలకు వెళ్తామని వెల్లడించారు. అయితే జీవోలు రద్దు చేసే వరకు చర్చలు జరిపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

మరోవైపు ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉద్యోగుల బిల్లులకు సంబంధించిన ట్రెజరీ సర్వర్‌లో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. అయినా కానీ కొత్త జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నేడు, రేపు కూడా బిల్లులను ప్రాసెస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 25 శాతం మంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్‌ చేసినట్టు తెలుస్తోంది. పోలీస్‌ శాఖతో పాటు, కోర్టు ఉద్యోగుల బిల్లులే ట్రెజరీలకు చేరినట్టు సమాచారం. మరోవైపు డీడీవోలకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ఉద్యోగులు లేఖలు ఇచ్చారు.

Civilians Moon : జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లే క్రూయిజర్‌ వాహనం

ఏపీలో పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నాలుగు మెట్లు దిగినా ఉద్యోగసంఘాలు చర్చలకు రారా అని మంత్రులు ప్రశ్నిస్తుంటే.. ఆ కామెంట్స్ం‌ను ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. చర్చలకు రాకపోతే చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు రావాల్సిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అయితే చర్చలకు రాలేదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను ఏపీ ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు ఖండించారు. తొమ్మిది మంది ప్రతినిధులను చర్చలకు పంపించామని తెలిపారు. జీవోలను పక్కనపెట్టి పాతజీతాలు ఇవ్వమని అడిగామని చెప్పారు. తొమ్మిది మందిని పంపిస్తే అవమానం చేశారని బొప్పరాజు వాపోయారు. మంత్రుల స్థాయిలో ఉన్నవారు అబద్దాలు మాట్లాడొద్దన్నారు. 3 నెలల నుంచి చర్చల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని వెంకటరామిరెడ్డి అన్నారు.