Cyclone Mandous: ఏపీకి పొంచిఉన్న ముప్పు.. తుఫానుగా మారిన తీవ్రవాయుగుండం.. ఆ జిల్లాల్లో రెడ్అలర్ట్..

ఏపీకి మాండౌస్ తుఫాన్ గండం పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్థరాత్రి దాటాక తుఫాన్ గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Mandous: ఏపీకి పొంచిఉన్న ముప్పు.. తుఫానుగా మారిన తీవ్రవాయుగుండం.. ఆ జిల్లాల్లో రెడ్అలర్ట్..

Cyclone Mandous

Cyclone Mandous:ఏపీకి మాండౌస్ తుఫాన్ గండం పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్థరాత్రి దాటాక తుఫాన్ గా మారింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపుగా తుఫాన్ దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర జిల్లాల్లో, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

’Mandous‘ Cyclone : ముంచుకొస్తున్న ‘మాండౌస్’ తుఫాన్ .. ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు..పిడుగులు పడే అవకాశం

తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను మధ్య శుక్రవారం రాత్రి సమయంలో గంటలకు 67-75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దూసుకొస్తున్న తుఫాన్ కారణంగా శనివారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాండూస్‌ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి 10, 11 తేదీల్లో ఏపీలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Cyclone Sitrang: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తప్పిన తుపాన్ ముప్పు..!

ఈనెల 11వ తేదీ వరకు మాండౌస్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ వై హరినారాయణన్ ఇప్పటికే అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బంది వాగులు, వంకలు, చెరువుల వద్ద నీటి ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం నుంచి తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.